Sunday, June 24, 2012

అగ్నిపర్వత లావా చెరువు...ఫోటోలు

కాంగో దేశంలోని విరుంగా నేషనల్ పార్క్ లో ఉన్న నయిరాగొంగో అగ్నిపర్వతం ఆఫ్రికాలోనే ఎక్కువు యాక్టివ్ గా ఉండే అగ్నిపర్వతం. విరుంగా నేషనల్ పార్క్ లో మొత్తం 8 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో ఈ అగ్నిపర్వతం ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటం వలన అక్కడ లావా ఎప్పుడూ ఉడుకుతూ నెత్తుటి మడుగులాగా కనబడుతుంది. ఈ అగ్నిపర్వతం అత్యంత భయంకరమైనది. ఒకొక్కసారి ఈ అగ్ని పర్వతం పేలినప్పుడు అందులోనుండి లావా 10,700 అడుగుల ఎత్తువరకు లేస్తుందట. ఈ మద్య ఈ అగ్నిపర్వతపు లావా 8,800 అడుగులదాకా పైకి ఎగిసిందట. ఈ అగ్నిపర్వతం ఎన్ని సంవత్సరాలుగా యాక్టివ్ గా ఉన్నదో తెలియదు కానీ 1882 నుండి 1977 వరకు 34 సార్లు పేలుడ్లు సంభవించినాయాట. కొన్ని సార్లు ఒక సంవత్సరం పొడుగునా ఈ అగ్నిపర్వతంలో నుండి లావా పైకి ఎగిసిపడుతూనే ఉందట.ఈ అగ్నిపర్వతంలో నుండి వెలువడే లావా బాగా పలుచగా ఉంటుందట. 2002 లో ఈ అగ్నిపర్వతం పేలినప్పుడు దగ్గరున్న రవండా నగరం పొలిమేరలలో నివసిస్తున్న 40, 000 మందిని వేరు ప్రదేశాలకు తరలించేరు.


No comments:

Post a Comment