Friday, June 15, 2012

వార్తలను వ్యంగ్యంగా చూపిన అముల్ వ్యాపార ప్రకటనలు.....ఫోటోలు

మన దేశం లో వ్యాపార ప్రకటనలు చాలానే వచ్చినా అందరికీ సదా గుర్తుండే ప్రకటనలలో అముల్ డైరీ వారి ప్రకటనలు తప్పకుండా వుంటుంది. దానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. కారణం సమకాలీన సంగతులని, వార్తలనీ వ్యంగ్యంగా చూపించడమే.

ఫిబ్రవరి 2011....యూ.ఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం క్రిష్ణ తన స్పీచ్ కు బదులు పొరపాటున పోర్చుగల్ మినిస్టర్ స్పీచ్ చదివినప్పుడు.

మే 2011....భారదేశం పాకిస్తాన్ కు పంపిన టెర్రరిస్ట్ లిస్ట్ లో పొరపాట్లు చేసి అవమాన పడినప్పుడు.

మే 2011.....ఒసామా బిన్ లాడన్ చంపబడప్పుడు.

ఏప్రిల్ 2011.....కేరళా వ్రుద్ద రాజకీయ నాయకుడు వి.ఎస్. అచ్చ్యుతానందం రాహుల్ గాంధీనీ అముల్ బేబీ అన్నప్పుడు.

జనవరి 2012.....జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ కు శల్మాన్ రష్డీ ని పిలిచినప్పుడు, ఆయన వస్తారా, రారా అన్న సంశయం చోటుచేసుకున్నప్పుడు.

షారూఖాన్ వాంకేడియా స్టేడియం లో గొడవపడినప్పుడు.

ఈ మధ్య ముంబైలో రేవ్ పార్టీ దాడిలో పోలీసులకు సెలెబ్రెటీలు పట్టుబడ్డప్పుడు.

జగన్మోహన్ రెడ్డి ని ఆస్తుల వ్యవహారంలో సి.బి.ఐ అరెస్టు చేసినప్పుడు.

భారత ప్రెశిడెంట్ ఎన్నికల సంధర్భంగా మమతా బెనర్జీ మరియూ ములాయం సింగ్ యాదవ్ కలుసుకొన్నప్పుడు.

2 comments:

  1. అమూల్ ప్రకటనలు చూడటం నాకిష్టం. ఇక్కడ ఇచ్చినవి బాగున్నాయి. వార్తలకెక్కిన సంఘటనలను గుర్తుచేస్తూ తాజాతాజాగా భలే తయారుచేస్తారు ప్రకటనలు! అచ్యుతానంద్ రాహుల్ ని ఏకంగా ‘అమూల్ బేబీ’తోనే పోల్చినపుడు ఆ సందర్భాన్ని అమూల్ ప్రకటన సహజంగానే మిస్ చేయలేదు!

    ఈమధ్య అన్నా హజారే, రాందేవ్ కలయికను అమూల్ ప్రకటనలో DOSTANNA! అనే ఆకట్టుకునే క్యాప్షన్తో అలంకంరించారు!

    ReplyDelete
  2. ’అమూల్ బేబీ సృష్టికర్త శ్రీ యూస్టేస్ ఫెర్నాండెజ్..’ పేరుతో నేను నా బ్లాగులో ఆయన జీవిత విశేషాలు వ్రాశాను. ఈ లి్ంక్ నొక్కి చూడగలరు.
    http://radhemadhavi.blogspot.in/2012/01/blog-post.html
    దానిలోనే ఒక అరవై వరకూ అమూల్ బేబీ కార్టూన్లు కూడా ఉన్నాయి.

    ReplyDelete