Friday, June 22, 2012

ఖాళీచేయబడ్డ (వదిలిపెట్టబడ్డ) ద్వీపాలు....ఫోటోలు

కొన్ని ద్వీపాలు మిలటరీ ఉపయోగాలకోసం వాడుకున్నారు. అక్కడ కొన్ని భవనాలూ, ఇళ్ళు కట్టబడ్డాయి. వీటిలో కొంతమంది ప్రజలు తరతరాలుగా నివసిస్తూ వచ్చేరు. కానీ సరైన వసతులు లేకనో, ప్రక్రుతివైపరీత్యాలవలనో, న్యూక్లియర్ ఆయుధ పరిశోధనలవలనో లేక నాగరికతలో నివసించలనో ఈ ద్వీపాలలో నివసిస్తున్న ప్రజలు ద్వీపాలను ఖాళీ చేసేరు. ఈ ద్వీపాలలో సమయము ఆగిపోయింది కానీ అక్కడున్న భవనాలూ, ఇళ్ళూ మరియూ వీధులూ అలాగే ఉన్నాయి.

Hirta, Scotland, UK....హిర్తా అని పిలువబడే ఈ ద్వీపం అతి పెద్దది. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ ద్వీపంలో గత 2 శతాబ్ధాలుగా ప్రజలు నివసించేవారు. అత్యధికంగా 180 మంది నివసించేవారు. 1851 లో 100 మంది ప్రజలే ఉండేవారు. 1930 లో ఈ ద్వీపంలో విష జ్వర తాకిడివలన అందరినీ ఖాళీ చేయించేరు.

Holland Island, Maryland, USA....సముద్రపు నీరు ద్వీపంలోకి చొచ్చుకు రావడం వలన ఈ ద్వీపం ఖాళీ చేయబడింది. 1910 వరకు ఈ ద్వీపంలో 360 మంది నివసించేవారు. 1914 లో అతి పెద్ద సముద్రపు అలలు ద్వీపాన్ని చుట్టుముట్టడంతో అందరూ నగరంలోకి వెళ్ళిపోయేరు.

North Brother Island, New York, USA...ఈ ద్వీపంలో 1885 వరకు ప్రజలు నివసించేవారు. 1850 లో స్మాల్ పాక్స్ వ్యాధి నివారణకోసం బ్లాక్ వెల్ ద్వీపం(ఇప్పుడు దీనిని రూస్వెల్ట్ ద్వీపం అంటారు)లో నిర్మించ బడ్డ రివర్ సైడ్ హాస్పిటల్ ను ఈ ద్వీపానికి మార్చేరు. మొట్టమొదట అంటు వ్యాధి అయిన స్మాల్ పాక్స్ పేషెంట్లను క్వారంటైన్ చేయడానికి ఈ ద్వీపానికి తీసుకు వచ్చేరు. ఆ తరువాత మిగిలిన అంటు వ్యాధుల పేషెంట్లనూ ఈ ద్వీపానికి తీసుకువచ్చి చికిత్స ఇచ్చేవారు. 1940 లో ఈ హాస్పిటల్ ను మూసేసేరు. అప్పటి నుండి ఈ ద్వీపం ఖాళీగానే ఉన్నది.

Hashima Island, Japan......గన్ కంజీమా అని పిలువబడే ఈ ద్వీపం నాగసాకీ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 500 మంది మాత్రమే నివసించే ఈ ద్వీపాంలో సముద్రం క్రింద బొగ్గు గనులు ఉండటంతో 1887 నుండి 1974 వరకు ఎక్కువమంది ఉండేవారు. ఈ ద్వీపం ప్రశిద్ది చెందడానికి కారణం ఈ ద్వీపం చుట్టూ కాంక్రీట్ గోడ కట్టడం మరియూ ద్వీపంలో పెద్ద పెద్ద కాంక్రీట్ భవనాలు ఉండటం. 1890 లో మిట్స్ బుషీ కంపెనీ వారు ఈ ద్వీపాన్ని కొనుకున్నారు. ఆ తరువాత బొగ్గు తీయడం ఆపివేయడంతో ఈ ద్వీపాన్ని ఖాళీచేసేరు.

Great Blasket Island, Ireland.....ఐర్లాండ్ దేశంలోని ముఖ్యమైన ద్వీపం ఇది. 1953 వరకు ఇక్కడ ప్రజలు నివసించేవారు. ఆ తరువాత ఐర్లాండ్ ప్రభుత్వం ఈ ద్వీపంలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి రక్షణ ఇవ్వలేమని తెలిపేరు. అందువలన ఇక్కడ నివసిస్తున్న ప్రజలు నగరాలకు తరలి వెళ్లేరు.

Stroma, Scotland, UK........ఈ ద్వీపం కైత్నెస్స్ అనే రైతుకు సొంతమైనది. ఇక్కడ గొర్రెలకు కావలసిన గడ్డి ని పండించేవారు. మొదట్లో 550 మంది నివసించేవారు. 1901 లో ఆ సంఖ్య 475 కు తగ్గింది. 1960 లో అక్కడ నివసించే ప్రజల సంఖ్య 100 కు తగ్గింది. పొట్టుకూటి కోసమూ మరియూ నాగరికతకు దగ్గరవ్వాలనే ఆశతో మిగిలిన వారు నగరాలకు వెళ్ళిపోయేరు. 1962 నుండి ఈ ద్వీపం ఖాళీగానే ఉన్నది.

Great Isaac Cay, Bahamas.....బిమినీ ద్వీపానికి 20 మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం లో ఒక పెద్ద లైట్ హౌస్ కట్టేరు. పడవ ప్రయాణీకుల వసతికోసం 1859 లో అక్కడ ఈ లైట్ హౌస్ కట్టేరు. ఆ లైట్ హౌస్ లో పనిచేసేవారికోసం 4 ఇళ్ళు కట్టేరు. 1969 లో ఈ లైట్ హౌస్ ను మూసేసేరు. అందువలన ఈ ద్వీపం ఖాళీగానే ఉన్నది.

No comments:

Post a Comment