Friday, June 8, 2012

పాకిస్తాన్ లోని దెరావర్ కోట...ఫోటోలు

పాకిస్తాన్ లోని బహవల్పూర్ దగ్గరున్న ఈ దెరావర్ కోట చదురాకారంలో కట్టబడిన అతిపెద్ద కోట. ఈ కోటలో ఉన్న 40 బురుజులు కొన్ని మైళ్ల దూరంలో ఉన్నవారికి కూడా కనబడుతుంది. 1500 మీటర్ల గుండ్రని ఆకారం తో 30 మీటర్ల ఎత్తుకు కట్టబడింది.మొట్టమొదట ఈ కోటను జైసాల్మర్ కు చెందిన హిందూ రాజ్ పుట్ రాయ్ జజ్జా భాటి కట్టేరు. 1733 వరకు ఈ కోట ఆ రాజ్ పుట్ కుటుంభీకులకు సొంతంగానే ఉండేది. ఆ తరువాత బహవల్పూర్ నవబులు స్వాధీనం చేసుకుని కోట మొత్తాన్ని మళ్ళీ కట్టుకున్నారు. ఆ తరువాత 1804 లో నవాబ్ ముభారక్ ఖాన్ ఈ కోటను సొంతంచేసుకున్నారు. ఈ కోటకు పక్కనే ఒక మసీదు కట్టేరు.ఈ మసీదును డెల్లీ లోని రెడ్ ఫొర్ట్ లాగా రూపొందించేరు.


No comments:

Post a Comment