Thursday, June 7, 2012

ఈ సంవత్సర ఎండాకాలం ధాటికి కారణం గ్లోబల్ వార్మింగే......ఫోటోలు మరియూ వీడియో


ఈ సంవత్సరం మన దేశాన్ని అతాకుతలం చేసిన ఎండలు కొంచం తగ్గుముఖం పట్టేయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురైయ్యేరు. ఎందరో మరణించేరు. సహజంగా మే నెలాఖురుకి తగ్గవలసిన ఎండాకాలం ఈ సంవత్సరం మరో 10 రోజులు ఎక్కువగా గడిపింది. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఎండాకాలం ఇంకా ముగింపుకు రాలేదనే చెప్పాలి.


ఇలా ప్రజలు ఎండలకు తపించిపోవటానికి ముఖ్య కారణం ప్రపంచదేశాల ప్రభుత్వాలే. ఎందుకంటే వీరంతా ప్రక్రుతితో ఆడుకున్నారు. శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా ఏ ఒక్క ప్రభుత్వమూ పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటమే దీనికి అతి ముఖ్య కారణం. దీనితో ప్రక్రుతి మానవులకు ఎదురుతిరిగింది.


ఈ విషయాన్ని ఆలశ్యంగా తెలుసుకున్న ప్రపంచదేశాలు(చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటమంటే ఇదే) ఈ మధ్య పర్యావరణ పరిరక్షణ ప్రణాళికకు అక్షరాబాస్యం చేసేరు. కానీ దేశాల మధ్య విభేధాలు ఏర్పడటంతో ఆ ప్రణాళికలు పూర్తి స్థాయి ఆచరనలోకి రాలేదు. ఒక వేల అన్నిదేశాలు ఈ విషయములో ఒకటిగా చేరినా పర్యావరణ పరిరక్షణతో ప్రక్రుతిని పూర్తిగా పాత స్థితికి తేలేరు. కాబట్టి ప్రక్రుతికి మానవులు ఇప్పటివరకూ చేసిన హానికి శిక్షలు పడుతూనే ఉంటాయి.అందులో భాగమే ఇప్పుడు మనం చూస్తున్న ఎండాకాలం.


మనదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేయి. స్పైన్ దేశంలోని సెవిల్లా అనే చోట 50 C, ఆస్త్రేలియాలోని ఊడ్నడట్టాలో 51 C, ఇజ్రేల్ దేశంలోని తిరాట్ జవీలో 54 C, కాలిఫోర్నియా లో 56.7 C, ఇరాన్లోని దస్త్-ఈ-లుట్ లో 70.C గా నమోదయ్యింది. ఇవన్నీ మామూలు కంటే 5 నుండి 7 డిగ్రీల C ఎక్కువ.


గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటో చవిచూసేరు. దీని ప్రభావం వచ్చే ఎండాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుందట. ఈ లోపు రాబోయే వర్షా కాలం మరియూ చలికాలం కూడా మామూలుకంటే ఎక్కువ ప్రభావం చూపుతుందట.



No comments:

Post a Comment