Wednesday, June 27, 2012

కాళ్ళులేని స్పెన్సర్ వెస్ట్ కిలిమంజారో కొండను చేతులతో ఎక్కేడు....ఫోటోలు మరియూ వీడియో

కెనడా దేశంలోని టొరంటో నగరానికి చెందిన 31 సంవత్సరాల స్పెన్సర్ వెస్ట్ అతని చిన్నతనంలోనే (అంటే 5 ఏళ్ల వయస్సులో) స్పైనల్ కార్డ్ లో వచ్చిన వ్యాధి వలన తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. డాక్టర్లు అతని తల్లితండ్రుల దగ్గర ఇక స్పెన్సర్ వెస్ట్ జీవితంలో పెద్దగా ఏమీ సాధించలేడని తెలిపేరు. కానీ స్పెన్సర్ వెస్ట్ తన ఆత్మ శక్తితో డాక్టర్లు చెప్పింది నిజంకాదని నిరూపించే విధంగా చేయలేని సాహసం చేసేడు. కిలిమంజారో కొండను కఠిన శ్రమతో 7 రోజులలో ఎక్కగలిగేడు. 80 శాతం కొండను రెండు చేతులతో ఎక్కేడు. అతని ఇరువురి స్నేహితులు అతని కార్య సాధనలో అతనికి సహాయపడ్డారు. అతను ఈ సాధన వలన 3 కోట్ల రూపాయలు పొందేడు. కానీ ఈ డబ్బు మొత్తాన్నీ "Free the Children" అనే చ్చారిటీకి అందజేసేడు.No comments:

Post a Comment