Sunday, June 24, 2012

భూగ్రహ సంభంధ బరువును అధికమిస్తున్న ప్రజలు....ఫోటోలు

మానవ జాతిలో పెరిగిన, పెరుగుతున్న బరవు భూగ్రహ వనరులపై తాకిడి చూపిస్తోంది. ఎలాగంటే ఇప్పుడు భూమిమీదున్న స్థూలకాయు మనుష్యుల వలన ప్రపంచ జనాభా బరువు మామూలుకంటే ఒక బిల్లియన్ కేజీల ఎక్కువగా ఉన్నదట. ఈ విషయం ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో తెలిసింది. ఏ దేశంలో లేక ఏ ఖండంలో ఎక్కువమంది స్థూలకాయు ప్రజలు ఉన్నారో ఊహించి చెప్పటానికి ఎటువంటి బహుమతులూ లేవుగానీ, నిజాలు మాత్రం తెలుసుకుందాము.

ప్రస్తుత ప్రపంచ జనాభా తో ఈ భూమి మోస్తున్న మొత్త బరువు 287 మిల్లియన్ టన్నులు. నిజానికి ఈ బరువు 268.5 మిల్లియన్ టన్నులుగా మాత్రమే ఉండి ఉండాలి. అంటే ప్రపంచ జనాభాలో స్థూలకాయు మనుష్యుల వలన 18.5 మిల్లియన్ టన్నుల బరువు ఎక్కువగా ఉన్నది.

సాధారణంగా ఒక ఆరొగ్యమైన ఒక మనిషి యొక్క సరాసరి బరువు 62 కేజీలు గా ఉండాలి. కానీ నార్త్ అమెరికాలో ఒక మనిషియొక్క సరాసరి బరువు 80.7 కేజీలుగా ఉన్నది. ప్రపంచ జనాభాలో ఆసియా దేశాల ప్రజల సంఖ్య 61 శాతం . ఆసియా దేశాలలో మనుష్యుల యొక్క సరాసరి బరువు 57.7 కేజీలుగా ఉన్నా ప్రపంచ స్థూలకాయు మనుష్యుల బరువులో 13 శాతంగా ఉన్నదట. ప్రపంచ జనాభాలో నార్త్ అమెరికా జనాభా 6 శాతం మాత్రమే అయినా అక్కడున్న స్థూలకాయు ప్రజల బరువు ప్రపంచ జనాభా బరువులో 33 శాతంగా ఉంటోందట.

స్థూలకాయుం ఒక అంటువ్యాధిగా పరిగనిస్తున్నారు. దీని వలన మనుష్యుల ఆరొగ్యం దెబ్బ తినడమె కాకుండా స్థూలకాయు మనుష్యుల వలన వనరులు తగ్గిపోతున్నట్లు గ్రహించేరు. ఇప్పుడు ప్రతి దేశంలోనూ స్థూలకాయు మనుష్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందట.

ప్రపంచ జనాభాను తగ్గించాలని, ముఖ్యంగా బీద దేశమైన ఆఫ్రికా స్త్రీలు ఎక్కువమంది పిల్లలను కంటున్నారని, దీనివలన భూగ్రహ వనరులు తాకిడికి గురౌతున్నాయని చెబుతున్నవారు స్థూలకాయు మనుష్యులవలన భూగ్రహ సంభంధ బరువు దెబ్బ తింతున్నదని ఈ పరిశోధనా రిపోర్ట్ తయారుచేసిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫసర్ ఇయాన్ రాబర్ట్ తెలిపేరు.

ప్రస్తుతం స్థూలకాయు మనుష్యులు ఎక్కువగా ఉంటున్న దేశాలు 1. అమెరికా 2. కువైట్ 3.క్రొయేషియా 4. కతార్ 5. ఈజిప్ట్ 6. యూనైటడ్ అరబ్ ఏమిరేట్స్ 7. ట్రినిడాడ్ & టొబాగో 8. అర్జెంటీనా 9. గ్రీస్ 10. బెహరిన్.

No comments:

Post a Comment