Thursday, June 21, 2012

మనం ఈ సృష్టి కి ఎంత ఋణ పడి ఉన్నాం?...ఫోటోలు

గాలి(ప్రాణ వాయువు లేక ఆక్సిజన్) లేకుండా మనం ఎంతోసేపు బ్రతకలేము.వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్ ఉన్నదని మీ అందరికీ తెలుసు. సృష్టి చే ఉచితంగా ఇవ్వబడుతున్న ఈ గాలిని స్వేచ్చగా పీల్చుకుని మనం హాయిగా బ్రతుకుతున్నాం.


అలాంటి స్వేచ్చమైన, స్వచ్చమైన గాలిని కలిషితం చేసేస్తున్నాం. అభివ్రుద్ది పేరుతో సృష్టి నిర్మించిన టెక్నాలజీని మనం వదులుకుంటున్నాం. గాలి ఉత్పత్తికి కారణమైన చెట్లను ఏరిపారేస్తూ మానవులు నిర్మించే టెక్నాలజీలలోకి వెళ్ళిపోతున్నాము.


మానవులు నిర్మించిన టెక్నాలజీ పెరిగిన తరువాత దీని (గాలి) విలువ ఎంతో మనకి తెలిసింది. దీనితో లెక్క కడితే ప్రతి మనిషీ ఈ సృష్టి కి ఎంత ఋణ పడి ఉంటామో తెలుసుకోవచ్చు. కానీ ఈ ఋణాన్ని ఎలా తీర్చుకుంటామో మాత్రం తెలియదు.


ప్రతి మనిషీ ఒకరోజుకు 3 సిలిండర్ల ఆక్సిజన్ పీల్చుకుంటాడు. ఈ రోజు ఒక ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు రూ.700/-. కాబట్టి, మనం ఒక రోజుకు రూ.2,100/- విలువగల ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. సంవత్సరానికి దీని ఖరీదు రూ. 7, 66,500/- అవుతోంది. ఈ రోజు లెక్కలను బట్టి మనిషి యొక్క సరాసరి జీవితం కాలం 65 సంవత్సరాలుగా తీసుకుంటే మనిషి పీల్చుకునే మొత్త గాలి యొక్క ఖరీదు రూ.500,000.000/- లేక 50 మిల్లియన్ రూపాయలు. ఇంత విలువగల గాలిని మనం చెట్ల నుండే ఉచితంగా తీసుకుంటున్నాము.


3 comments:

  1. భలే చక్కటి పోస్ట్ వేసారండి.

    ReplyDelete
  2. శ్రుష్టి కాదండి, సృష్టి , దయచేసి సరిచేయగలరు, in post heading and in content also.

    ReplyDelete
    Replies
    1. శశి గారికి,

      మీరు చెప్పినట్లే సవరించేను...ధన్యవాదాలు

      మీకోసం

      Delete