Wednesday, June 20, 2012

సూర్య గ్రహానికి అవతలున్న గ్రహాలలో ఉన్న కొండలను చూడటానికి నిర్మించబడుతున్న అతి పెద్ద టెలెస్కోప్....ఫోటోలు

యూరప్ లో ఉన్న దేశాలలొని 15 దేశాలు కలిసి ప్రపంచమ్న్లొనే అతిపెద్ద టెలెస్కోప్ ను నిర్మించడానికి తయారౌతున్నారు. ఈ టెలెస్కోప్ లో ఉండే అద్దం 39 మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడున్న అతి పెద్ద టెలెస్కోప్ లో ఉన్న అద్దం కంటే ఇది 4 రెట్లు పెద్దది. ఈ టెలెస్కోప్ ఎంత శక్తివంతమైనదంటే అంత్రిక్ష శాస్త్రవేత్తలు సూర్య కుటుంభానికి అవతల వైపు ఉన్నటువంటి గ్రహలనూ, గ్రహాలలోని కొండలనూ, అక్కడున్న అంత్రిక్ష డార్క్ మాటర్నూ భూమి నుండే చూడగలుగుతారు. దీనికి "యూరోపియన్ ఎక్స్ ట్రీంలీ లార్జ్ టెలెస్కోప్"(European Extremely Large Telescope...E-ELT) అని పేరు పెట్టేరు. ఈ టెలెస్కోప్ పై వెలుతురు కాలుష్యం లేకుండా ఉండాలని దీనిని చిలి దేశంలో నిర్మిస్తున్నారు. 3060 మీటర్ల ఎత్తున్న కొండపై దీని నిర్మిస్తున్నారు. ఈ టెలెస్కోప్ 2022 లో ఉపయోగానికి వస్తుందని చెబుతున్నారు. ఈ టెలెస్కోప్ నిర్మించడానికి 1083 మిల్లియన్ యూరోలు లేక 872 మిల్లియన్ పౌండ్లు లేక 69,760 మిల్లియన్ రూపాయలు ఖర్చౌతుందని అంచనా. ఇటాలీ, నెదర్లాండ్, పోర్చుగల్, స్పైన్, స్వీడన్, స్విజర్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, బ్రిజిల్, జెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్ మరియూ జెర్మనీ దేశాలు కలిసి నిర్మిస్తున్నారు.


No comments:

Post a Comment