Sunday, June 17, 2012

అంటార్కిటికా లో ఎండు లోయ....ఫోటోలు

అంటార్కిటికా అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది మంచు(ఐస్)ప్రదేశం. కానీ దాంట్లోని ఒక చిన్న భాగం ఎండు లోయ గా ఉండటం ఆశ్చర్యం. న్యూజీలాండ్ దేశానికి సమీపంలో ఉన్న అంటార్కిటికా ఖండంలోని ఒక భాగం ఇలా ఎండులోయగా ఉన్నది. అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధృవ ఖండం. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ల తరువాత ఐదవ పెద్ద ఖండం. యూరప్ మరియు ఆస్ట్రేలియా దీనికంటే చిన్నవి. ఈ ఖండం 98% మంచు తో కప్పబడి ఉంది. మిగిలిన 2% లో ఉన్నదే ఈ ఎండులోయ. అందులోనూ ఈ ఎండులోయ 0.03% మాత్ర్రమే. అయితే కిలోమీటర్ల లెక్కలో 4,800 చ.కి.మీ. అంటార్కిటికాలోనే మంచు(ఐస్) ఉండని ప్రాంతం ఇదే. ఈ ప్రాంతాన్ని మాక్ ముర్డో డ్రై వాలీస్ అంటారు.


No comments:

Post a Comment