Saturday, June 16, 2012

టూరిస్ట్ అట్రాక్షన్లుగా మారిన అందమైన ప్రక్రుతి గుంటలు...ఫోటోలు

బ్రహ్మాండమైన అద్భుతాలను మనకి చూపించి మనల్ని ఆశ్చర్యపరచటం ప్రక్రుతి ఎప్పుడూ ఆపదు. ఈ క్రింది ఫోటోలు చూస్తే ఈ విషయం మీకే తెలుస్తుంది. ఈ క్రింది ఫోటోలలో మీరు చూస్తున్న గుంటలు ప్రక్రుతిగా వాటంతటవే అకస్మాత్తుగానో లేక క్రమక్రమంగానో ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఏర్పడిన అందమైన ప్రక్రుతి గుంటలు. ఈ గుంటలన్నీ టూరిస్ట్ అట్రాక్షన్లుగా మారినై.

Dean's Blue Hole, Bahamas....663 అడుగుల లోతున్న ఈ నీలి రంగు సముద్రపు నీటి గుంట సముద్రానికి కొద్ది దూరంలో ఏర్పడిన పెద్ద గుంట. ఆ నేల యజమాని పేరు డీన్ బ్లూ. అందుకని ఆ గుంటకు ఆ పేరు పెట్టేరు. ఈ మధ్య ఈ గుంటలోకి ఫ్రీ డైవింగ్ చేసి ఈత కొట్టేవారు ఎక్కువయ్యేరు.

Bimmah Sinkhole, Oman.....ఇక్కడ భూమి యొక్క నేల పొర నిలకడగాలేకపోవడంతో ఈ గుంట ఏర్పడింది. ఈ గుంటలోకి వచ్చిన నీరు ఈ గుంటకు 1650 అడుగుల దూరంలో ఉన్న సముద్రంలోనివి.

The Great Blue Hole, Belize....బెల్జీ సముద్రతీరంలో ఏర్పడిన ఈ గుంట చాలా ప్రశిద్దిచెందింది. 407 అడుగుల లోతు, 984 అడుగుల వెడల్పు కలిగిన ఈ గుంట యూనెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్.

Ik Kil, Mexico....ఈ గుంట మెక్సికో నగరంలోని ఆర్చియోలాజికల్ పార్క్ లో ఏర్పడిన గుంట. దీనిని ప్రక్రుతి స్విమ్మింపూల్ అంటారు.

Red Lake, Croatia....ఇది ప్రపంచంలోని పెద్ద ప్రక్రుతి గుంటలలో మూడవది. దీనిలోపల చాల గుహలు ఉన్నాయట.

Zacatón, Mexico.....ఈ గుంటలోని నీరు వేడిగా ఉంటుందట. అందుకని దీనీని తెర్మల్ వాటర్ హోల్ అంటారు.

Morning Glory Pool (Hole), Wyoming, USA.....ఇది కూడ తెర్మల్ వాటర్ హోల్. యెల్లోస్టోన్ పార్క్ లో ఉన్నది. ఈ గుంట పొద్దు తిరుగుడు పువ్వులాగా ఉండటంతో 1880 లో దీనికి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ పూల్ అని పేరుపెట్టేరు.

Neversink Pit, Alabama, USA....ఇది లైం స్టోన్ గుంట. చక్రాలలాగా అమరికలు కలిగి, ఎన్నో వాటర్ ఫాల్స్ కలిగిన ఈ గుంట ఎక్కువగా ఫోటోలు తీయబడ్డ గుంట. ఈ గుంటలో గబ్బిలాలూ మరియూ అడవి పశువులు మేసే ఒక తరహా గడ్డి కలిగి ఉంటుంది.

Balaa Sinkhole, Lebanon.....820 అడుగుల లోతు కలిగిన ఈ గుంట లోకి పడే వాటర్ ఫాల్స్ 3 పొరలను చ్చేదించుకుని వెళ్లడమే చాలా అందంగా ఉంటుంది. దీనిని 3 వంతెనల వాటర్ ఫాల్స్ అంటారు.

4 comments: