Friday, June 15, 2012

సియాచిన్...ప్రపంచంలోనే ఎత్తైన యుద్ద భూమి....ఫోటోలు

సియాచిన్ మంచు కొండలు హిమాలయా పర్వతాల తూర్పు భాగంలో ఉన్నది. హిమాలయా పర్వతాలలోని ఎత్తైన 5 మంచు కొండలలో సియాచిన్ ఒకటి. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉండి, 78 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సియాచిన్ ప్రపంచంలోని నాన్-పోలార్ ప్రదేశాలలో ఉన్న 2 వ పెద్ద మంచుకొండ. కానీ సియాచిన్ లోని ఎక్కువ ప్రాంతం లైన్-ఆఫ్-కంట్రోల్ (LOC) లో ఉన్నది. భారతదేశమూ, పాకిస్తానూ ఈ ప్రాంతంకోసం గొడవలు పడుతూనే ఉన్నాయి. 1984 నుండీ అప్పుడప్పుడు ఈ ప్రాంతంలో భారత-పాకిస్తాన్ల మధ్య యుద్దం జరిగింది. 1971 యుద్దం తరువాత రెండుదేశాలూ ఒక ఒప్పందానికి వచ్చేయి(simla అగ్రీమెంట్). కానీ ఈ అగ్రీమెంట్లో ఈ మంచుకొండను ఎవరి కట్టుబాట్లో ఉంచుకోవాలో సరిగ్గా రాసుకోలేదు. యునైటడ్ నేషన్స్ మాత్రం ఈ అందమైన మంచుకొండను రక్తంతో తడపకండని రెండుదేశాలనూ అభ్యర్ధించిది. ఈ ప్రాంతం కోసం జరిగిన యుద్దాలలో కంటే ఈ ప్రాంతంలోని వాతావరణం వలనే ఎక్కువ మంది సైనికులు చనిపోయేరు. ఈ ప్రాంతంలో ఇరుదేశాలవారు యుద్దం చేయకూడదని ఒప్పందం (సీస్ ఫైర్) చేసుకున్నా , ఇరు దేశాలూ తమ సైనిక దళాలను సుమారు 150 చోట్లలో రక్షణకై రక్షణా శిబరాలలో ఉంచేరు. దీనికోసం ఇరుదేశాలూ చేసిన ఖర్చు 200-300 మిల్లియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలోని అతి ఎత్తైన చోట(21,000 అడుగుల ఎత్తులో) భారతదేశం హెలిపాడ్ ను నిర్మించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా సాదారణ ప్రజలు లేరు.


1 comment: