Monday, June 11, 2012

వివిధ రంగుల ఉప్పు కోలనులు....ఫోటోలు

సాన్ ఫ్రాన్ సిస్కో సముద్రతీరాన ఈ వివిధ రంగుల ఉప్పు కోలనులు కనబడతాయి. కార్గిల్ ఇన్ కార్పోరేషన్ అనే కంపెనీ ఇక్కడ ఉప్పు తీసే పరిశ్రమను నడుపుతోంది. సముద్రపు నీటిని పెద్ద పెద్ద కోలనులలో ఉప్పుతీయడానికి నిలువచేస్తారు. ఈ కంపెనీవారు ప్రక్రుతిగానే ఉప్పు తయారుకావాలని, సముద్రపునీటిని ఈ కోలనులలొకి తోడుతారు. ఈ కోలనులలోకి తోడిని సముద్రపు నీరు ప్రక్రుతి పరంగా కారు ఉప్పునీళ్ళుగా మారడానికి 5 సంవత్సరాలు పడుతుంది.నీరంతా ఎండిపోయిన తరువాత ఆ నీటిలోని ఉప్పు, ఉప్పు రాళ్ళుగా ఉండిపోతుంది. సుమారు 5 నుండి 8 ఇంచ్ ల ఎత్తుకు ఉప్పు పేరుకుంటుంది. ఆ తరువాత ఆ ఉప్పుని తీసి శుద్దీకరిస్తారు.

సముద్రపు నీరు కోలనులలో ఉన్నప్పుడు, ఆ నీరు ఆవిరౌతున్నప్పుడు అందులో ఉప్పు అధికమౌతుంది. అప్పుడు ఆ నీరు రంగులు మారుతుంది. అలా సముద్రపు నీరు రంగులుమారడానికి కారణం 3 బాక్టీరియాలు. సైనేకోకస్, హాలో బాక్టీరియా మరియూ డ్యునాలియల్లా. నీరు ఎక్కువ ఆవిరౌతున్నకొద్దీ మిగిలిన నీటిలో ఉప్పు ఎక్కువౌతుంది. అప్పుడు మిగిలిన నీటి రంగు మారుతుంది. సాన్ ఫ్రాన్ సిస్కో సంద్రతీరం పై నుండి విమానంలో ప్రయాణం చేసే వారు విమాన కిటికీలలో నుండి వీటిని చూడవచ్చు.


1 comment: