Sunday, June 10, 2012

బోస్టాయ్(నార్వే) జైలు ద్వీపం: ఖైదీలను సంస్కరించే జైలు....ఫోటోలు మరియూ వీడియోలు

ప్రపంచంలోనే అతి తక్కువ నేరాలు జరిగేది ఒక్క నార్వే దేశంలోనే. బహుశ ఈ టపాలో మీరు చదివే విషాయాలు దీనికి ఒక ముఖ్య కారణమై ఉండవచ్చు. నార్వేలో జైలు సిస్టం చాలా లిబరల్ గా ఉంటుంది.


"శిక్ష పేరుతో నాలుగు గోడల మధ్య నేరస్తులను ఉంచితే వారిలో మార్పు రాదు. జీవితం ఇంతే నని అనుకుని జైలు నుండి విడుదల అయిన తరువాత వారు తిరిగి నేరాలకు పాల్పడతారు. కాబట్టి వారికి పడిన శిక్షా కాలంలో వారు జీవితం అంటే ఏమిటో, అది ఎంత ఆనందమైనదో వారు తెలుసుకోవాలి. ఇక మీదట నేరాలు చేయకూడదనే మార్పు వారిలో రావాలి. అందుకే ఈ సంస్కరనా విధానాలూ, జైలు" అని ప్రభుత్వ చట్ట అధికారులూ చెబుతారు.


ఇక్కడ మీరు చూస్తున్న బోస్టాయ్ ద్వీపం ఒక జైలు. కానీ ఇది జైలులాగా ఉండదు. ఒక టూరిస్టు ప్రదేశంలాగా ఉంటుంది. ఇక్కడున్న ఖైదీలు నాలుగు గోడల మధ్య ఉండరు. విశ్రాంతి భవనాలలో ఉంటారు. ఈ ద్వీపంలో ఉన్నవన్నీ విశ్రాంతి భవనలే.ఒక్కొక్క భవనంలోనూ 6 నుండి 8 ఖైదీలు ఉంటారు. ప్రొద్దున పూట వారే వంట చేసుకుని తినాలి. రాత్రి పూట మాత్రం జైలు డైనింగ్ హాలులో తినాలి. ఇక్కడున్న ఖైదీలు ప్రొద్దున 8 గంటల నుండి సాయత్రం 3 గంటల వరకు పనిచేయాలి. ఆ తరువాత వారు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ ఖైదీలకు కట్టుదిట్టాలు ఉండవు. సెక్యూరిటీ గార్డులు ఉండరు, ఫెన్సింగ్ లు ఉండవు. జైలులో ఉన్నట్లు అనిపించదు.


ఈ ద్వీపానికీ అసలు దేశానికీ దూరం 4 మైళ్లే. అయితే ఈ ద్వీపానికి రావాలంటే ఒక్క పడవ ప్రయాణం మాత్రమే. అది కూడా శిక్ష పడిన నేరస్తులను తీసుకురావడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడకు కఠిన శిక్షలు వేసిన వారినే తీసుకువస్తారు. హత్యలు చేసిన వారు, మానబంగాలు చేసిన వారే ఎక్కువమంది. నార్వేలో అత్యధిక శిక్షా కాలం 21 సంవత్సరాలు. ఇక్కడ శిక్షలు గడిపిన వారు తిరిగి వెళ్ళిన తరువాత నేరాలకు పాల్పడిన చరిత్రే లేదట.ఈ ద్వీపం నుండి తప్పించుకోవటానికి ఎవరూ ప్రయత్నించరట. ఒక వేళ ఎవరైన ప్రయత్నించి పట్టుబడితే వారు జీవిత కాలం చీకటి గదులలో గడపాలట. అందుకని ఏ ఖైదీ తప్పించుకునే ప్రయత్నం చేయడు.


No comments:

Post a Comment