Friday, June 8, 2012

నిద్ర సుఖ మెరుగదు... ఫోటోలు

మనసు కలతచెందితే కంటికి కునుకురాదు. మానసిక ఒత్తిడి, మనోవేదన, ఇతర సమస్యలు నిద్రలేమికి దారితీస్తాయి. ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు నిద్రలేని రాత్రిని చవిచూసి వుంటారు. అవసరాల కోసం రాత్రంతా నిద్ర మేలుకోవడం అందరి జీవితాలలోను సంభవిస్తుంది. అయితే ఎంత ప్రయత్నించినా నిద్రపట్టకపోవడం కొందరికి శాపంలా పరిణమిస్తుంది. మరికొందరికి నిద్ర వస్తున్నా సరైన చోటులేక నిద్ర పోరు. మరి అలాంటివేమీ వీరికి లేదా?..... చైనాలో ఎక్కడపడితే అక్కడ నిద్రపోతున్న వారిని చూసి ఆశ్చర్యపోయిన జెర్మన్ ఫోటోగ్రాఫర్ బెరండ్ హగేమాన్ తీసిన ఫోటోలు ఇవి…. "చైనాను నిద్రపోనివ్వండి. లేస్తే ప్రపంచాన్నే గడగడ లాడిస్తుంది" నెపోలియన్ ఒక సారి హెచ్చరించేరు. కానీ చైనా వారు ప్రశాంతతనే కొరుకుంటున్నారు అని ఈ ఫోటోగ్రాఫర్ అంటున్నారు. 2002 లో ఈ ఫోటోగ్రాఫర్ "స్లీపింగ్ చైనీస్" అనె వెబ్ సైటును ఓపెన్ చేసి అందులో ఇప్పటిదాకా 700 ఫోటోలను ఉంచేరట.


ఫోటో క్రెడిట్స్: స్లీపింగ్ చైనీస్ .కాం

5 comments:

  1. :-)
    ఆకలి రుచెరగదు...ఫోటోలు???

    ReplyDelete
  2. క్షుధా తురాణామ్ న ఉడికిర్న ఉడకః
    నిద్రా తురాణామ్ న మెట్టర్న పల్లః

    ReplyDelete