Saturday, June 2, 2012

ఇంజిన్ ఆయిల్ మరియూ వెజిటబల్ ఆయిల్ గా ఉపయోగ పడుతున్న పువ్వుల గింజలు...ఫోటోలు

మీరు చూస్తున్న ఫోటోలోని ప్రదేశాన్ని పువ్వుల సముద్రం అంటారు. ఇది చైనా లోని హౌంగ్ షాన్ సిటీ కి దగ్గరలో ఉన్న కనోలా రేప్ సీడ్ ఫార్మ్. మార్చ్ నెలలో ఈ ప్రదేశమంతా పసుపురంగుతో అలుముకున్నట్లు ఉంటుంది. ఆ అందాలను చిత్రీకరించడానికి ప్రపంచం నలుమూలల నుండి ఫోటోగ్రాఫర్స్ ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు.

మొట్టమొదట, అంటే 19 వ శతాబ్ధములో ఈ పువ్వు గింజల నుండి ఇంజిన్ ఆయిల్ తయారుచేసేరు. ఎందుకంటే ఈ పువ్వు గింజలు మానవ ఆహారంగా గానీ లేక జంతువుల ఆహారంగా గాని ఉండేందుకు పనికిరాలేదు. ఎందుకంటే ఇందులో గ్లూకో సినోలేట్స్ అధికంగా ఉండటం వలన ఇది అత్యంత చేదుగా ఉండేది. అందువలన ఎక్కువుగా పండుతున్న ఈ పువ్వు గింజలను ఎలా ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో ఆ గింజల నుండి తీసే ఆయిల్ ఇంజెన్లలో వాడవచ్చునని తెలుసుకున్నారు. ఆ తరువాత, టెక్నాలజీ పెరగడంతో, ఈ గింజల నూనెలో గ్లూకో సినోలేట్స్ ను తగ్గించ గలిగేరు. అప్పుడు ఇది మానవ ఉపయోగానికి పనికొచ్చింది. ఇప్పుడు ఈ పువ్వు గింజల నూనె మానవులు ఉపయోగించే నూనెలలో 3 వ స్థానం పొందింది. మిగిలిన రెండూ పాం ఆయిల్ మరియూ సోయాబీన్ ఆయిల్. ఈ పువ్వుల పంటని యూరప్ దేశాలూ, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా మరియూ ఇండియా దేశాలు పండిస్తున్నాయి. ప్రపంచ వాటాలో ఇండియా వాటా 13 శాతంగా ఉన్నది.

అయితే ఈ పువ్వుల పంట చైనా దేశంలో ఒకే చోట పండటంతో అక్కడి ప్రదేశం అందరినీ ఆకర్షిస్తోంది.

No comments:

Post a Comment