Friday, June 1, 2012

క్యుయాండో సరస్సు: వెయ్యి ద్వీపాల సరస్సు మరియూ మునిగిపోయిన పురాతణ నగరాలు...ఫోటోలు

ఈ సరస్సు చైనాలో ఉన్నది. ఈ సరస్సు క్రుతిమముగా నిర్మించబడింది. 1959 లో పక్కన ఉన్న నది లో హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు వరదలా వెలువడిన నీరు ఈ సరస్సు నిర్మించడానికి కారణమైంది. 573 చదురపు కిలోమీటర్ల దూరనికి వరద నీరు చేరడంతో ఈ సరస్సుని మంచినీటి రిజర్వాయర్ గా మార్చేరు. ఈ సరస్సులో సుమారు 1000 పైగా చిన్న చిన్న భూ ప్రదేశాలు ఉండటంతో ఈ సరస్సుకు వెయ్యి ద్వీపాల సరస్సు అనే పేరు వచ్చింది. ఈ సరస్సు ప్రాంతంలో 90 శాతం అడవిగా ఉండటం వలన ఇక్కడి నీరు అడవి లోని వన మూలికల కలయికలతో అద్భుతమైన మంచినీరుగా మారింది. ఈ నీటిలో కావలసిన మినరల్స్ ఉండటంతో చైనాలోని ఒక పెద్ద కంపెనీ ఇక్కడి నుండే వారి బ్రాండ్ మినరల్ వాటర్ ను సరఫరా చేస్తున్నారు.

ఇంతే కాదు. ఈ చోటు సరస్సుగా మారడానికి ముందు అక్కడి బూమి క్రింద 2 పురాతణ నగరాలు ఉండేవిట. వాటి పేర్లు సీ చంగ్ మరియూ హే చంగ్. 2001 లో ఈ పురాతణ నగరాలను కనుగొన్నారు. ఈ పురాతణ నగరాలను టూరిస్టులకు చూపించటానికి ఒక సబ్ మేరియన్ ఏర్పాటుచేసేరు. కానీ సరస్సులలో సబ్ మేరియన్స్ వెళ్ళకూడదని చట్టం చెప్పటంతో దానిని రద్దుచేసేరు.


1 comment:

  1. More information here:
    http://en.wikipedia.org/wiki/Qiandao_Lake

    ReplyDelete