Saturday, June 30, 2012

గాజుతో చేసిన శిల్పకళ......ఫోటోలు

ఫ్లోరీడా కు చెందిన రాబర్ట్ మిక్లెసెన్ గాజుతో చేసే శిల్పకళలో ప్రపంచ ప్రక్యాతి పొందిన కళాకారుడు. ఈయన గాజుతో రూపొందించిన శిల్పకళ లో కొన్ని మీకొసం.


Friday, June 29, 2012

దక్షిణాయనం మొదటి రోజు న్యూయార్క్ లో వేలాదిమంది యోగా అభినయం...ఫోటోలు

ప్రతి సంవత్సరం జూన్ 20 వ తారీఖున న్యూయార్క్ లోని టైంస్ స్కొయర్ వద్ద వేలది మంది నగర రోడ్ల మీద యోగా అభినయం చేస్తారు. దక్షిణాయనం మొదటి రోజు యోగా అభినయం చేస్తే ప్రశాంతత దొరుకుతుందని వారి నమ్మకం. ఈ యోగా అబినయం కోసం అక్కడికి వచ్చిన వారందరికీ యోగా అభినయం చేయడానికి ఉచితంగా చాపలూ ఇస్తారు. పిల్లలూ, పెద్దలూ, ఆడ, మొగ అందరూ ఇందులో పాల్గొంటారు. మధ్యాహ్నము లంచ్ టైములో చేసే ఈ యోగా అభినయనప్పుడు ఎప్పుడూ ట్రాఫిక్ మరియూ మనుష్యులతో నిండిపొయే ఆ చోటంతా యోగా అభినయనం చేసే వారితో పాటూ, ఆ అభినయనాన్ని చూసే ప్రజలతో ప్రశాంత వాతావరణం చోటుచేసుకుంటుంది.


చంద్రునితో అద్భుతమైన ఫోటోగ్రాఫీ.....ఫోటోలు


మానవులు ఒక సంవత్సరానికి ఎంత ఆహారాన్ని పారేస్తున్నారు....ఫోటోలు

ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న ఆహర పధార్ధాలలో 30 శాతం మనిషి నోటిదాకా వెళ్లడంలేదట. ఇది మనుష్యులకు జేరేలోపు పాడైపోవటమో లేక మనుష్యులే పారేయడమో జరుగుతోందట. ఇలా పారేస్తున్న ఆహార పధార్ధాలు ఎంతనుకుంటున్నారు?......1.3 బిల్లియన్ టన్నులట. ఈ విషయాన్ని ఈ మధ్య రియో+20 సమావేసంలో యూనైటడ్ నేషన్స్ విడుదలచేసింది. నార్త్ అమెరికా మరియూ యూరప్ లో కలిపి సుమారు 222 మిల్లియన్ టన్నుల తినడానికి అర్హత ఉన్న ఆహార పధార్ధాలను పారేస్తున్నారట.

స్వీడన్ లోని స్వీడిస్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ బయో టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైషేషన్ శాస్త్రవేత్తలూ కలిపి జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఆహార పధార్ధాలు పారేయడమనేది వ్యాపారుల దగ్గర నుండి డైనింగ్ టేబుల్ వరకు జరుగుతోందట......ఎక్కువ డబ్బున దేశాలలో ఎక్కువ శాతం ఆహారపధార్ధాలను మానవులే పారేస్తున్నారట. తక్కువ డబ్బు కలిగిన దేశాలలో ఆహార పధార్ధాలను వ్యాపారులే( వారి దగ్గరున్నప్పుడే పాడైపోవటమ వలన) పారేస్తున్నారట. ....నార్త్ అమెరికా మరియూ యూరప్ లలో ప్రతి మనిషీ సంవత్సరానికి 280 నుండి 300 కేజీల ఆహార పధార్ధాలను పారేస్తుంటే ఆఫ్రికా మరియూ సౌత్ ఈస్ట్ ఏసియలో 120 నుండి 170 కేజీల వరకు పారేస్తున్నారట.

అభివ్రుద్ది చెందుతున్న దేశాలలో 40 శాతం ఆహారం పంట పండిన తరువాత నుండి అది వ్యాపారస్తులకు జేరేలోపు పాడైపోతుంటే అభివ్రుద్ది చెందిన దేశాలలో అదే 40 శాతం షాపులలో వ్రుధా అవుతోందట.....ఇక అంకెలకు వస్తే పారేయబడుతున్న ఆహార పధార్ధాల విలువ 1 లక్ష కోట్లు ఉంటుందట. ఇందులో 57 శాతం వ్రుధా అవకుండా చేయగలిగే అవకాసాలున్నా అలా చేయకపోవడంవలన వ్రుధా అవుతున్నదట.

భారత దేశంలో పారేయబడుతున్న/పారేస్తున్న ఆహార పధార్ధల విలువ 44,500 కోట్ల రూపాయలట.....అహార పధార్ధాలు పారేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువగా కొనుక్కోవడం, ఎక్కువగా వండుకోవడం, తమకు నచ్చనవి కొనుకొచ్చేరని, ప్యాకేజి ఫుడ్ లో ఎక్స్ పైరీ తారీఖు అయిపోయిందని, తిన్నా తినకపోయినా ధర తక్కువగా ఉన్నదని ఇలా మరెన్నో కారణాలు.

21 వ శతాబ్ధంలో కూడా ఆకలి చావులు చోటుచేసుకుంటున్నాయని అన్ని దేశాలకూ తెలుసు. అంతే కాకుండా ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల ఆహార పధార్ధాల కొరత తలెత్తుతున్నదని కూడా అన్ని దేశాలకూ తెలుసు. పర్యావరణ మార్పిడి వలన, నీటి కొరత వలన రాబోవు కాలంలో పంటలు దెబ్బ తినే అవకాశం వున్నదని కూడా అందరికీ తెలుసు.

కాబట్టి ఆహార పధార్ధలను నిలువ చేసే టెక్నాలజీ ని అభివ్రుద్ది చేయాలి. పండిన పంటను బద్రంగా దాచుకోవాలి......అఫ్ కొర్స్ ప్రతి మనిషీ ఆహార పధార్ధాలను పారేయకుండా ఉండటానికి తన వొంతు ఆలోచన చేయాలి.

Thursday, June 28, 2012

అతి ప్రమాదకరమైన జంతువులు.....ఫోటోలు

ఆఫ్రికా పొద ఏనుగు... అత్యంత క్రూర బలం కలిగిన ఈ ఏనుగు చాలా ప్రమాదకరమైనది. మామూలు ఏనుగులు మనుష్యులను చూసిన వెంటనే చంపాలని చూడవు. కానీ ఈ ఏనుగు మాత్రం మనిషి కనబడితే చాలు చంపడానికే ప్రయత్నిస్తుంది.

ఆఫ్రికన్ సింహం

సముద్రపు జెల్లీ ఫిష్.....సముద్రపు జీవులలోనే అత్యంత విషపూరితమైన ఈ జెల్లీ ఫిష్ ను సముద్రపు కందిరీగ అంటారు. దీనిని బాక్స్ జెల్లీ అని పిలుస్తారు.

ఇన్లాండ్ తైపాన్...ఇది ఒక రకం పాము. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే.

మానవుడు....దుర్బుద్ది కలిగిన జంతువు.......చరిత్ర పుస్తకాలు తిరగెస్తే శకాలు విడిపోయినందుకూ, సామాజిక, రాజకీయ మరియూ దారుణ మైన ఘటనలకు ఎక్కువగా యుద్దాలే కారణమని చెబుతుంది. 2,00,000 సంవత్సరాల ఆధునిక మానవ చరిత్రలో ఎకరీతిగా చేసింది ఒకరిని ఒకరు చంపుకోవటమే. జంతువులు పోట్లాడుకుంటాయి. మానవులు యుద్దం చేస్తారు. భూమిమీదున్న జీవరాసులలో మానవ జాతి మాత్రమే తమ జాతినే అంతంచేసుకునే చర్యలు చేపడతారు. సైన్స్ అభివ్రుద్దిలో ఎక్కువగా మనుష్యులను అంతంచేయడానికి కావలసిన ఆయుధాలను కనుగొనడంలోనే ఎక్కువ పరిశోధనలు జరుగుతాయి.

దోమ.... మైక్రో స్కోపిక్ జంతువులలో అతి ప్రమాదకరమైనది. ఎక్కువ చావులకు కారణమైన జంతువు అనే పేరుతో చరిత్రలో చోటుచేసుకున్నది. వీటిని చాలా ఈజీగా చంపవచ్చు కానీ ఇవి కుట్టేలోపు ఆ పనిచేయలేము. ఈ లోపు అది హాని చేసేస్తుంది.

సొర చేప... దీనిని పర్ఫెక్ట్ కిల్లింగ్ మిషన్ అంటారు.

గంతులేసే దున్నపోతు....... ఇది ఏప్పుడు చంపుతుందో ఎవరికీ తెలియదు. ఏమీ చేయనట్లే ఉంటూ సడ్డన్ గా దాడి చేస్తుంది. దీనీ అడ్డుకోవడం కూడా చాలా కష్టం. దీని శరీర చర్మం ఎంత గట్టిదంటే దీనిని చంపడానికే ఒకప్పుడు డబుల్ బ్యారల్ గన్ తయారుచేసేరంటే అర్ధం చేసుకోవచ్చు.

క్లాస్ ట్రీడియం బొటులినం......భూమి మీదున్న అతి విషపూరితమైన జంతువు......ప్రపంచంలోని మానవ జాతిని చంపడానికి 4 కిలోల బాక్టీరియా సరిపోతుంది. ఈ బాక్టీరియా ప్రతి ఖండంలోనూ, ప్రతి వాతావరణంలోనూ ఉంటుంది. సముద్రపు మట్టిలో ఉండే ఈ బాక్టీరియా ఆ మట్టిని తింటేనే మానవులలో ప్రవేసిస్తుంది. బాయ్లింగ్ నీళ్లలో 10 నిమిషాలు బ్రతకగల ఈ బాక్టీరియా మానవ కడుపులోని ఆసిడ్లో బ్రతకలేదు.

Wednesday, June 27, 2012

ఇవి ఫోటోలు కావుట...పైంటింగుట.....ఫోటోలు

ఇంగ్లాండ్ కు చెందిన నతన్ వాల్స్ అనే కళాకారుడు పెద్ద పెద్ద నగరాల మీదున్న ఆకర్షనతో వాటిని పైంటింగ్ చేస్తాడట. అతను వేసిన ఆయిల్ పైంటింగ్స్ చూస్తే నిజమైన నగరాలను చూస్తున్న అనుభూతి కలుగుతుందట. ఇతను వేసిన పైంటింగ్స్ ను చాలా ఎక్జిబిషన్లలో ఉంచేరట. ఈ మధ్య లండన్ నగరంలో జరిగిన ఒక ఎక్జిబిషన్లో ఆయన వేసిన పైంటింగ్స్ ను చూసి ప్రజలు అత్నికున్న కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపోయేరట. అందులోని కొన్ని పైంటింగ్స్ ఫోటోలే మీరు క్రింద చూస్తున్నవి.

ఇవి ఆయన వేయబోతున్న పైంటింగ్స్ కు వేసుకున్న డ్రాయింగ్.