Saturday, May 26, 2012

"టోక్యో స్కై ట్రీ"(Tokyo Skytree) ప్రపంచంలోనే రెండవ ఎత్తైన నిర్మాణం ఓపెన్ చేసేరు....ఫోటోలు మరియూ వీడియో

మానవులచే నిర్మించబడ్డ రెండవ ఎత్తైన నిర్మాణం "టోక్యో స్కై ట్రీ"(మొదటిది దుబాయ్ లో ఉన్న బ్రిజ్ కలీఫా )టవర్ ను మంగళవారం నాడు ప్రజల దర్శనార్ధం తెరిచేరు. ఈ టవర్ వలన టోక్యో నగరం మరింత అందాలతో నిండిందనే చెప్పాలి.

2080 అడుగుల ఎత్తు గలిగిన ఈ టవర్ టీవీ మరియూ రేడియో సిగ్నల్స్ ను రిలే చేయడానికోసం కట్టేరు. 1958 నుండి ఇక్కడ 338 అడుగుల ఎత్తుగల టవర్ ఉండేది. దానిని పగులకొట్టి ఆ చోట ఈ 2080 అడుగుల ఎత్తుగల టవర్ ను కట్టేరు. దీనిని ఒక టూరిస్ట్ స్పాట్ గా కూడా చేసేరు. ఎత్తైన చోట రెండు అబ్సర్ వేటివ్ డెక్ లు ఉంచేరు. ఒక హోటల్ కట్టేరు. ఈ టవర్ ను తెరిచిన వెంటనే చూడాలనే ఆత్రుతతో ఒక వారం రోజుల నుండి ప్రజలు టికెట్లకోసం అక్కడ క్యూలో నిలబడ్డారు.

2008 జూలై 14 న నిర్మాణం మొదలుపెట్టేరు. ఫిబ్రవరి 19, 2012 లో పూర్తిచేయబడి అధికారులకు మాత్రం అందుబాటులో ఉన్నది. 22 మే 2012 న ప్రజల దర్శించడానికి అనుమతించేరు. ఇంతకు ముందెన్నడూ లేనంత ఎర్త్ క్వేక్ రెసిస్టన్స్ నిర్మాణం తో కట్టేరు. అంతే కాక ఈ టవర్ ని బ్లూ మరియూ పర్పుల్ రంగుల లెడ్ లైట్లతో అలంకరించడంతో, టవర్ మీద అప్పుడప్పుడు మారుతున్న రంగులు కళ్లకు విందు గా ఉంటున్నదట.


No comments:

Post a Comment