ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Tuesday, May 15, 2012
జపాన్ లో మిణుగురు పురుగుల పండుగ సంధర్భంగా నదిలో ఒక లక్ష LED లైట్లు...ఫోటోలు
పోయిన శని,ఆదివారాలలో టోక్యో నగరంలో "టోక్యో హొటారు"(హోటారు అంటే మిణుగురు పురుగు) అనే పండుగ జరుపుకున్నారు. ఈ పండుగ సంధర్భంగా సెంట్రల్ టోక్యోలో పారుతున్న సుమిదా నదిలో ఒక లక్ష LED లైట్లను నదీ నీటిలో తెలేటట్లు చేసేరు. "ప్రార్ధనా నక్షత్రాలు" అనే పేరుతో పేనసోనిక్ కంపెనీవారు చిన్న చిన్న బంతుల రూపంలో LED లైట్లు తయారు చేసి నీటిలో వదిలేరు. ఈ LED లైట్ల బంతులు నీరు తగిలిన వెంటనే వెలిగేటట్లు తయారుచేసేరు. ఈ లైట్లు పూర్తిగా సూర్య రశ్మి ఎనర్జీ తో తయారుచేసినవని తెలిపేరు. సంబరాలు పూర్తి అయినాక పెద్ద వల వేసి ఈ బంతులను తిరిగి తీసేరు.
ఫోటో క్రెడిట్:
Mai Suzuki,ajpscs ,makure , Jeremy V.,tokyo-hotaru.com
Subscribe to:
Post Comments (Atom)
EXCELLANT THANKS
ReplyDelete