Thursday, May 24, 2012

ఈ ప్రదేశాన్ని "భూమి మీద స్వర్గం" అంటారు...ఫోటోలు

నీటిపై చిన్న చిన్న గుడిసెలలాగా కనిపించే ఈ నిర్మాణాలను చూస్తుంటే చాలా అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది . ఇదొక అద్భుతమైన ఆక్వా సెన్ట్రిక్ లగ్జరీ రిసార్ట్స్. దీని పేరు బోరా బోరా. ఫ్రాన్స్ సమీపంలో ఉన్న ఫస్పిక మహాసముద్ర తీరంలో ఐలాండ్ దీవులలో ఒక భాగం అయిన దీవి మెత్తంలో ఈ బోరా బోరా హౌటల్ వుంది. .ఇది మొట్టమొదటిగా నీటిపై నిర్మించిన అద్భుతమైన రిసార్ట్స్. ఇందులో ఉన్న సౌకర్యాలు ఎన్నో ప్రత్యేకతలతో, ఎంతో ఖర్చుతో కూడినటువంటి సౌకర్యాలు. ఇటువంటి ఆహ్లాదవాతావరణంలో ఒక్క రోజు గడిపినా చాలు అని అనిపిస్తుందట. ఈ ద్వీపంలో నవంబరు నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం ఉంటుంది. కాలాన్నిబట్టి కొద్దిగా హెచ్చతగ్గులు ఉన్నప్పటికీ, సగటు ఉష్ణోగ్రతలు 70 °F (21 °C) మరియు 88 °F (31 °C) మధ్య ఉంటాయట.


3 comments:

  1. ఫొటోలు బాగున్నవి.ధన్యవాదాలు.కాని ఫ్రాన్స్ దగ్గర పసిఫిక్ మహాసముద్రం లేదు.అట్లాంటిక్ మహాసముద్రం ఉంది.ఈ దీవులు చూస్తే పసిఫిక్ దీవుల లాగ ఉన్నాయి.(కొబ్బరి చెట్లు)బహుశా ఈ దీవులు ఫ్రాన్స్ అధీనంలో ఉన్నాయనుకొంటాను.ఒకసారి సరిచూసుకొండి.

    ReplyDelete