Saturday, May 5, 2012

ఈ ద్వీపాలకు ఎవరూ వెళ్ళరట....ఫోటోలు

పాముల ద్వీపం(Snake Island)....బ్రిజిల్ దేశానికి 90 మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపానికి అసలుపేరు Ilha de Queimada Grande.. కానీ అందరూ దీనిని పాముల ద్వీపం అంటారు. ఈ ద్వీపంలో అత్యంత విషపూరితమైన పాములు కో కొల్లలుగా ఉన్నాయట. ప్రతి ఇంచ్ కూ ఒక పాము ఉంటుందట. అందుకని ఈ ద్వీపానికి వెళ్ళడం నిషేదించబడింది.
పొవిగ్లియా ద్వీపం (Poveglia Island).... దూరం నుండి చూస్తేనే భయం పుట్టించే ఈ ద్వీపం ఇటలీ దేశ నగరమైన వెనీస్ కు కొద్ది దూరంలో ఉన్నది. ఈ ద్వీపానికి వెళ్ళడానికి ఎటువంటి నిషేధమూ లేదు. అయినా ఎవరూ ధైర్యం చేసి ఈ ద్వీపానికి వెళ్ళరు. కారణం రోము నగరంలో ప్లేగు అంటు వ్యాధి వచ్చినప్పుడు, నగరం నుండి ప్లేగు వ్యాధి వచ్చినవారిని ఈ ద్వీపానికి తరలించేరు. అలా తరలించినవారందరూ ఆ ద్వీపంలోనే చనిపోయేరు. ఆ వ్యాధి ముమ్మరం తగ్గిన తరువాత కూడా ఆ తరువాత 100 సంవత్సరాల వరకూ వెనీస్ నగరంలో ఉన్న ప్రజలలో ఎవరికైనా ఆ వ్యాధి లక్షణాలుంటే వెంటనే వారిని ఈ ద్వీపానికి తరలించేవారు. సుమారు 1,60,000 మంది ఆ వ్యాధి వలన ఆ ద్వీపంలో మరణించి ఉంటారని అంచనా. వారందరినీ అక్కడ తగలబెట్టేరు. ఈ ద్వీపంలో ఎటు చూసినా బొమికలే కనబడతాయట.
రమ్రీ ద్వీపం(Ramree Island)...బర్మా దేశ సముద్రతీరానికి దగ్గరలో ఉన్న ఈ ద్వీపాంలో అత్యంత విషపూరిత తేళ్ళూ, మలేరియ్య వ్యాధి సోకించే దోమలూ మరియూ ప్రమాదకరమైన ఉప్పునీటి మొసల్లూ ఉన్నాయట. రెండవ ప్రపంచ యుద్దములో జపాన్ సైనిక దళాలు శత్రు సైనికుల దగ్గరనుండి తమల్ని తాము కాపాడుకోవటానికి ఈ ద్వీపంలో తలదాచుకున్నారు. కానీ వారిలో 90 శాతం మంది తెలవారే లోపే చనిపోయేరట.
ఐజూ ద్వీపం(Izu Islands) జపాన్ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఈ ద్వీపం పై విషపూరిత గాలి ఉంటుందట. ఈ ద్వీపం క్రింద అగ్ని పర్వతం ఉన్నదట. ఆ అగ్నిపర్వతం నుండి వెళువడే సల్ఫర్ గాలిలో కలుస్తూ ఉంటుందట. ఈ ద్వీపంలో ఉన్న చాలామంది ద్వీపాన్ని కాలీ చేసే వెళ్ళిపోయేరట. కానీ ఇంకా కొంతమంది అక్కడే ఉంటున్నారట. వీరంతా ఎప్పుడూ మొహానికి మాస్కులు వేసుకునే ఉంటారట.
బాల్స్ పిరమిడ్ (Balls Pyramid)....1800 అడుగుల ఎత్తున్న ఈ పిరమిడ్ లో విషపూరిత క్రిములు ఉన్నాయట వీటిని Dryococelus australis అంటారు. వీటిని చూస్తేనే భయం పుడుతుందట.
రునిట్ ద్వీపం(Runit Island)....1946 నుండి 1962 వరకు అమెరికా ఇక్కడ 150 కి పైన న్యూక్లియర్ బాంబులను పరిశోధన చేసేరు. ఈ రోజుకు కూడా ఆ ద్వీపంలొని గాలిలో న్యూక్లియర్ రేడియేషన్ ఉన్నందువలన అక్కడికి వెళ్లటానికి ఎవరినీ అనుమతించరు.
ఫేరళ్లాన్ ద్వీపం(Farallon Island).. అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి దగ్గరలో ఉన్న ఈ ద్వీపంలో 1946 నుండి 1970 వరకు సుమారు 47,800 డ్రమ్ముల రేడియో ఆక్టివ్ వేస్ట్ ను ఇక్కడ పూడ్చేరు. అందువలన ఈ ద్వీపానికి ఎవరినీ వెళ్ళనివ్వరు.
గ్రూయిన్యార్డ్ ద్వీపం(Gruinard Island).... ఈ స్కాటిష్ ద్వీపం ఇప్పుడు సురక్షిత ప్రదేశమని తెలిపినా ఎవరూ ఇక్కడికి వెళ్లటంలేదు. కారణం, 1942 లో రెండవ ప్రపంచ యుద్దంకోసం బ్రిటీష్ వారు ఈ ద్వీపంలో ఆంత్రాక్స్ బాంబు తయారుచేసేరు. బాంబులతో పాటూ ఆంత్రాక్స్ బాక్టీరియాలను పొందుపరిచేరు. చివరిదాకా ఆ బాంబులను ఉపయోగించలేదు. వాటిని అక్కడే పాతిపెట్టెరని చెబుతున్నారు.

No comments:

Post a Comment