Wednesday, May 2, 2012

ఈ గ్రామాలలోమరణించడం చట్ట విరుద్దం.....ఫోటోలు

ఆశ్చర్యంగా ఉన్నదా?....కానీ ఇది నిజం. ప్రపంచంలో ఉన్న ఈ నాలుగు గ్రామాలలో చనిపోవడాన్ని చట్ట విరుద్దం చేసేరు. కారణాలేమిటో తెలుసుకుందాము.
ఇట్స్ కుషీమా(జపాన్).......జపాన్లోని ఈ ద్వీపం ఒక పుణ్యక్షేత్రం. అందువలన ఈ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడుటకు అక్కడి పూజారులు ప్రభుత్వాన్ని వొత్తిడిచేసి ఒప్పించి ఈ పుణ్యక్షేత్రంలో ఎవరూ చనిపోవడం జరగకూడదు అని చట్టం అమలుకు తెచ్చేరు. 1878 నుండి ఈ పుణ్యక్షేత్రంలో జనన మరణాలకు అనుమతిలేదని ప్రకటించేరు. గర్భిణీ స్త్రీలు గానీ, ముసలివారు గానీ ఈ పుణ్యక్షేత్రానికి రావాలంటే గర్భిణీ స్త్రీ ప్రసవించదని, ముసలివారు చనిపోరని సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. 1555 తరువాత అక్కడ ఎవరూ మరణించలేదట.
లాంగియార్ బైన్(నార్వే)......నార్వే దేశంలోని ఆర్కిటిక్ ద్వీపమైన ఇక్కడకూడా అలాంటి చట్టమే మలులో ఉన్నది. కానీ కారణం వేరు. ఈ ద్వీపంలో ఒకే ఒక అతిచిన్న శ్మాశానమే ఉన్నది. గత 70 సంవత్సరాలుగా ఇక్కడ పూడ్చిపెట్టటం ఆపేసేరు. ఇక్కడ పూడ్చిపెట్టిన శవాలు కుళ్లిపోకుండా అలాగే ఉన్నాయట. 1917 లో పూడ్చిపెట్టిన ఒక శవాన్ని శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు అతను చనిపోవడానికి కారణంగా ఉన్న ఇంఫ్లుయంజా వైరుస్ క్రిములు అలాగే ఉన్నాయట. అందుకని ఆ ద్వీపంలో సీరియస్ గా ఉన్నవారిని, చనిపోబోతున్న ముసలివారినీ విమానాలలోగానీ, ఓడలలోగానీ నార్వేకు తీసుకు వెడతారట.
ఫాల్సియానో డెల్ మస్సికో(ఇటాలీ)....ఇక్కడ పెద్ద కారణం ఏమీలేదు. ఈ చిన్న గ్రామంలో ఉన్న శ్మశానం నిండిపోయింది. కొత్తగా శ్మాశానానికి ఆ గ్రామంలో చోటులేదు. కొత్త చోటు దొరికే వరకు ఎవరూ ఆ గ్రామంలో మరణించరాదని, మరణించే దశలో ఉన్నవారు పక్క గ్రామానికి వెళ్ళాలని ఆ ఊరి మేయర్ ఉత్తరవు జారీచేసేరు.
సర్పౌరంక్స్(ఫ్రాన్స్)......ఇక్కడ కూడా పైఅన చెప్పినట్లే శ్మశానం సరిపోక ఎవరూ మరణించరాదని మేయర్ ఉత్తరవు జారీచేసేరు.

3 comments: