Friday, May 18, 2012

ఫేస్ బుక్, ఫేస్ బుక్, ఫేస్ బుక్...నిన్నంతా ఎవర్ని చూసిన ఇదే మాట...కారణం?....ఫోటోలు

ఎంతో కాలంగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న ఫేస్బుక్ ఇష్యూ నిన్న ప్రారంభమవటమే దీనికి కారణం.న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఫేస్బుక్ ట్రేడింగ్ను ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ రిమోట్ ద్వారా బెల్ మోగించి ప్రారంభించారు. క్యాలిఫోర్నియాలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం నుంచి జుకర్బర్గ్ బెల్ మోగించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, వేలాది మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫేస్ బుక్ సంచలనం రేపింది. పబ్లిక్ ఆఫర్లను ప్రకటించడం ద్వారా ఫేస్ బుక్ శుక్రవారం చరిత్ర సృష్టించింది. ఒక సాంకేతిక కంపెనీ పబ్లిక్ ఆఫర్లను ప్రకటించడం ఇదే ప్రప్రధమం. దాదాపు 16 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో 104 బిలియన్ డాలర్ల విలువ గల పబ్లిక్ ఆఫ్ను ఫేస్ బుక్ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నెట్వర్కింగ్ సైట్గా ఇది పేరు పొందింది.

మార్క్ జుక్‌బెర్గ్ నేతృత్వంలోని ప్రస్తుత ఫేస్ బుక్ నిన్నటి వరకూ 421 మిలియన్ షేర్స్‌ను కలిగి సాధారణ స్ధితిలో ఉన్నది. ఒక్కొక్క షేర్ విలువను 38 డాలర్ల విలువ కలిగి ఉన్నదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొనడంతో ఫేస్ బుక్ సంచలనం స్రుష్టించింది.


No comments:

Post a Comment