Wednesday, May 9, 2012

సింగపూర్ లో సూపర్ చెట్లతో సూపర్ గార్డన్....ఫోటోలు

ఎండల వేడి నుండి తప్పించుకోవాలంటే చెట్ల క్రిందకు వెళ్ళి తలదాచుకొంటేనే హాయిగా ఉంటుంది. ముఖ్యంగా తలదాచుకోవాలనుకునే చెట్లు పెద్దవిగా ఉంటే ఇంకా హాయిగా ఉంటుంది. అందుకనే ఎప్పుడూ స్టైలుగా కనబడే సింగపూర్, ప్రతి విషాయాన్నీ గ్రాండ్ గా చేసే సింగపూర్ అలాంటి పెద్ద చెట్లను పెట్టాలని అనుకుంది. కానీ పెద్ద చెట్లను వెంటనే పెట్టలేరు. చెట్లను నాటినా అవి పెద్దవయ్యేటప్పటికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అందుకని చెట్ల రూపాలతో పిల్లర్లు తయారుచేసి అందులో త్వరగా పెరిగే మొక్కలను పెట్టాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అమలు పరిచేరు. 50 మీటర్ల పోడవుకు సూపర్ చెట్లను నిర్మించేరు. అందులో తీగ మొక్కలను పెంచుతారు. చెట్ల మధ్య వంతెనలు నిర్మించేరు. ఆ వంతెనలమీద నడుచుకుంటూ నగర అందాలను తిలకించవచ్చు. ఈ అందమైన గార్డెన్ను జూన్ 29 తెరవటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

2 comments:

  1. hay

    Where do you got these pics

    I worked for this project for the last one year
    Particularly the yellow color walk way bridge is a real headache in construction but its worthwhile

    ReplyDelete
    Replies
    1. Ghanta Siva Rajesh గారికి,

      After knowing about the project I have made search about the project in google. There I got these pictures.

      మీకోసం

      Delete