Saturday, May 12, 2012

భూమి మీద అతి చలిగా ఉండే ప్రదేశం....ఫోటోలు

నార్త్ ఈస్ట్రన్ రష్యా దేశమైన సఖా లో ఉన్నటువంటి ఓయమైకాన్ అనే చిన్న గ్రామం ప్రపంచములోనే అతి చల్లటి ప్రదేశం. "స్టాలిన్ డెత్ రింగ్"(స్టాలిన్ పరిపాలనలో, పరిపాలనను ఎదురించిన రాజకీయ నాయకులను రష్యాలోనుండి బహిస్కరించి ఇక్కడకు పంపేవారట) అని పిలువబడే ఈ గ్రామంలో చలికాలంలో -45C టెంపరేచర్ ఉంటుందట. కొన్ని సార్లు -75C కి వెడుతుందట. 1920-30 లలో ఇక్కడ నివసిస్తున్న జాతి వారు ఎటువంటి కట్టుబాట్లకూ తలదించరని తెలుసుకున్న తరువాత, ఈ గ్రామంలో వారిని నగరాలలోకి రానిచ్చేవారు కాదట. ఇప్పుడు ఈ గ్రామంలో 500 మంది నివసిస్తున్నారట. ఇక్కడ జీవించటం చాలా కష్టం. ఇక్కడి మనుష్యులు ద్రువ జింక మాంసం మరియూ గుర్రం మాంసం తింటారు. ఇది మాత్రమే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మామూలుకాలం(ఎండాకాలం)తక్కువ కాబట్టి ఎటువంటి పంటలూ పండవు. సెల్ ఫోన్లు పనిచేయవు,పెన్ను లో ఇంకు పోస్తే గడ్డకట్టిపోతుంది, బాటరీలు పనిచేయవు, మెటల్ శరీరానికి అతుక్కుపోతుంది, గ్రీజు కూడా గడ్డకట్టిపోతుంది. బొగ్గు, చెక్కలతో మంటలు వేసుకుంటారు. సల సలా కాగే నీటిని గాలిలోకి విసిరితే ఆ నీరు క్రింద పడదు. పైనే గడ్డకట్టుకుపోతుంది.

1 comment:

  1. wow..ur blog is too good. suggest u to come up with some book (or PDF) with ur collection. so much of GK is here.

    ReplyDelete