Sunday, May 13, 2012

సంభ్రమాన్ని కలిగించే అంతర్జాతీయ పండుగలు....ఫోటోలు

కార్నివాల్ పండుగ ...బ్రెజిల్......బ్రెజిల్ దేశములో ముఖ్యమైన పండుగ.
చైనా వారి కొత్త సంవత్సరం...హాంకాంగ్....చైనాలో ఇదే అతి ముఖ్యమైన పండుగ. ఆ రోజు అందరూ ఎర్ర దుస్తులు ధరిస్తారు. పిల్లలకు "లకీ మనీ" అని చెప్పి ఎర్ర రంగు కలిగిన కవరులో డబ్బులు పెట్టి ఇస్తారు. ఆ రోజు టపాకాయలు కాలుస్తారు.
అక్టోబర్ పండుగ...జెర్మనీ.....జెరమనీ దేశంలో ఇది అతి ముఖ్యమైన పండుగ. ఈ రోజు వారు కొత్త కేకు తయారుచేసుకుని, అనేక మంది ఒకచోట కలుసుకుని తింటారు.
లాంతర్ పండుగ...తైవాన్.....తైవాన్ దేశంలో ముక్యమైన పండుగ. ఆ రోజు దుష్ట శక్తులను దేశం నుండి తరిమి కొట్టే రోజు. దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి టపాకాయలు కాలుస్తారు. ఆ తరువాత బలూన్లలో దీపాలను ఉంచి ఎగరవేస్తారు. తమ దేశంలో దుష్ట శక్తులు లేవని, అక్కడ అందరూ హాయిగా నివసించవచ్చునని తెలియజేయడానికి అలా చేస్తారట.
డైయా డి లస్ ముయెర్టోస్....మెక్సికో....ప్రతి సంవత్సరం నవంబర్ 1 వ తారీఖున ఈ పండుగ చేసుకుంటారు. ఇంట్లో దేవిని పఠం ఎదురుగా ఒక పీఠం అమర్చి దాని మీద దీపాలూ, అగరవత్తులూ,పండ్లూ, పానీయాలూ, పూవులు పెట్టి చనిపోయిన వారి పెద్దలను పిలుస్తారు.
హినా మట్సూరి....జపాన్.....ప్రతి సంవత్సరం మార్చ్ 3 వ తారీఖున జపాన్ ఆడ పిల్లలు బొమ్మల కొలువు పెడతారు. ఇది జపాన్ లో ముఖ్యమైన పండుగ. తెలిసినవారిని పిలిచి తీపి ఇస్తారు.
దీపావళి....ఇండియా... దీని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరంలేదనుటా. అందరికీ తెలిసినదే. దుష్ట శక్తుల నుండి భగవంతుడు ప్రజలను కాపాడిన ఈ రోజు ఇళ్ళలో దీపాలు అమర్చుకుని, టపాకాయలు కాల్చుకుని తరువాత తీపి తింటారు.
త్రంగ్ తూ....వియత్నాం....చంద్రుడు ప్రకాశవంతముగా ఉండే రోజును లెక్కించుకుని ఆ రోజు నక్షత్ర రూపంలో లాంతర్లు తయారుచేసుకిని వాటిలో దీపాలు ఉంచుకుని ఊరేగింపుగా వెడతారు. చంద్రుని ఆకారంలేనే కేకులు తయారుచేసుకుని తింటారు. దుష్ట శక్తుల దగ్గర నుండి తమల్ని కాపడి ఎప్పుడూ ప్రశంతంగా ఉంచమని కోరుకుంటారు.
కో కుక్ భరమి...తుర్కీ.....ప్రతి సంవత్సరం ఏప్రెల్ 23 న ఈ పండుగ చేసుకుంటారు. 1920 లో ఇదే రోజున వారికి బానిసత్వం నుండి విడుదల దొరికింది. అందుకని ఆ రోజును అందరూ కొత్త దుస్తులు వేసుకుని సంబరాలు చేసుకుంటారు.

No comments:

Post a Comment