Wednesday, May 9, 2012

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి శైవలాలు వీధి దీపాలు....వీడియో

వాతావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణం కార్బన్ డయాక్సైడ్. ఈ రోజు వాతావరణ కాలుష్యం వలన మనం ఎన్నో అవస్తలకు గురౌతున్నాము. కార్బన్ డయాక్సైడ్ గాఢతను తగ్గించడానికి అన్ని దేశాలూ ప్రణాళికలు మొదలుపెట్టినై. కానీ ఎవరూ దీనికి ఎక్కువ ముఖ్యత్వం ఇవ్వటం లేదు. దీనికి ముఖ్యత్వం ఇవ్వాలంటే దేశ అభివ్రుద్ది వెనుకబడుతుంది. గాలిలో దీని గాఢత 0.03 శాతం ఉంటుంది. ఈ శాతం పెరిగినపుడు హరిత గృహ ప్రభావం ( గ్రీన్ హౌస్ ఎఫెక్ట్) ఫలితం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఈ వాయువు హరిత గృహ ప్రభావం చూపే వాయువుల్లోకెల్లా అతి ముఖ్యమైంది. కిరణజన్య సంయోగ క్రియ లో వృక్షాలు ఈ వాయువు ను లోనికి పీల్చుకుని ఆక్సిజన్ వాయువునువెలువరిస్తాయి. ఈ రోజు ప్రపంచంలో వ్రుక్షాలు తగ్గిపోవటంతో కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోయింది. కార్బన్ డయాక్సైడ్ గాఢతను తగ్గించుకోవడనికి వివిధ దేశ ప్రభుత్వాలు వెనకంజు వేయడంతో శాస్త్రవేత్తలు ముందడుగు వేయడం మొదలు పెట్టేరు. అందులో ముఖ్యమైనది శైవలాలతో వీధి దీపాలు. సరళ దేహాలు, పత్రహరితం గల విభిన్న నిమ్న జాతి మొక్కల సముదాయము - శైవలాలు (ఆంగ్లం: Algae). శైవలాల అధ్యయన శాస్త్రాన్ని 'ఫైకాలజీ' (Phycology) అంటారు. శైవలాలలో సుమారు 18,000 ప్రజాతులు, 30,000 జాతులు వున్నాయి. ఇవి భౌగోళికంగా బహువైవిధ్యం కలిగి మంచి నీటిలో, ఉప్పునీటిలో, సముద్రాలలో, తడినేలలపై, రాళ్ళపై, మంచుతో కప్పబడిన ధృవప్రాంతాలలోను కొన్ని మొక్కల దేహభాగాలపై నివసిస్తాయి. ఇవి ఏకకణ లేదా బహుకణ నిర్మితాలుగా ఉండవచ్చును. ఆహారంగా, పశుగ్రాసంగా ప్రాచీన కాలం నుండి శైవలాలు మానవులకు పరిచయం. శైవలాలు పత్రహరితం ఉండడం వల్ల స్వయం పోషకాలు. మొక్కలుత్పత్తి చేసే 90 శాతం ఆక్సిజన్ వీటి నుండే విడుదలై జీవావరణంలో సకల జీవుల మనుగడకు కారణభూతమై ఉన్నది. శైవలాలు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ఇవ్వడంలో అత్యంత ముఖ్య పాత్ర వహిస్తుంది. అందువలన శైవలాలను ఉపయోగించి ఒక శాస్త్రవేత్త వీధి దీపాన్ని కనుగొన్నారు. ఈ దీపాలను ప్రతి చోటా అంటే మన గ్రుహాలలో కూడా అమర్చుకుంటే వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గిస్తుందట. బహుశ రాబోవు రోజుల్లో ఈ దీపాలను మనం ప్రతిచోటా చూడవచ్చు.

No comments:

Post a Comment