Saturday, May 12, 2012

బంక మట్టితో కట్టిన ప్రాచీణ ఎత్తైన భవనాలు....ఫోటోలు

యేమెన్ దేశంలోని షిబాం అనే టౌన్ లో ఎత్తైన భవనాలు కనబడతాయి. ఈ ఎత్తైన భవ్నాలన్నీ బంకమట్టితో కట్టినవి. ప్రతి భవనమూ 5 అంతస్తుల నుండి 10 అంతస్తులవరకు ఉంటుంది. ఈ ఇళ్ళన్నీ 16 వ శతాభ్ధములో కట్టినవట. ప్రపంచంలోనే పురాతణ ఎత్తైన భవనాలు గల ప్రదేశంగా దీనిని పేర్కొంటారు. ఇక్కడ సుమారు 7,000 మంది నివసిస్తున్నారట. 3 వ శతాబ్ధములోనుండే ఇక్కడ ఎత్తైన భవనాలు ఉండేవిట. కానీ 1532-33 లో వచ్చిన వరద తాకిడికి ఇక్కడి భవనాలు కొట్టుకుపోయేయట. అప్పుడున్న భవనాలలో కొన్ని ఇప్పటికీ ఉన్నాయట. మిగిలినవి 16 శతాబ్ధములో కట్టినవట. 1982 లో యూనెస్కో వరు ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చేరు.

No comments:

Post a Comment