Thursday, May 24, 2012

రోబోటిక్ చేప.....ఫోటోలు మరియూ వీడియో

నిజమైన చేపల మధ్య చేరి అచ్చం చేపలాగే కదులుతూ వాటిని ఆకర్షించే ఓ 'రోబోటిక్ చేప'ను శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. జంతు ప్రవర్తనను అర్థం చేసుకునేందుకుగాను ఇలాంటి చేపనుతయారుచేస్తున్నారు. ప్రవర్తనలో నిజమైన చేపలను అనుకరించే ఈ రోబోటిక్ ఫిష్.. చేపల్లో ఒకటిగా కలిసిపోవడమేగాక, వాటికి నాయకత్వమూ వహించిందని ప్రయోగం చేపట్టిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రోబో ద్వారా చేపల పరిరక్షణకు కొత్త మార్గాలను అనుసరించవచ్చన్నారు. ఉదాహరణకు సముద్రంలో చమురుతెట్టు లాంటి వాటివల్ల జలాలు కలుషితమైనప్పుడు చేపలకు మార్గదర్శకత్వం వహిస్తూ వాటిని ఆ ప్రాంతం నుంచి దూరంగా తీసుకుపోయేందుకు రోబో ఫిష్లు ఉపకరిస్తాయని వివరించారు. అలాగే సముద్ర కలుషితాన్ని ఎప్పటికప్పుడు తెలియపరుస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు చాలా దేశాలు రోబోటిక్ చేపలను తయారుచేసి సముద్రాలలో విడిచిపెడుతున్నారు. రోబోటిక్ చేపను తయారుచేయడానికి సుమారు 6 లక్షల నుండి 12 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారట.


No comments:

Post a Comment