Wednesday, May 9, 2012

మెదడును ఫిట్ గా ఉంచుకోవడం ఎలా?

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి అందరూ శరీర వ్యాయామం చేస్తారు. అలాగే మెదడును గూడా ఫిట్ గా ఉంచుకోవాలంటే మెదడుకు కావలసిన వ్యాయామం చేయాలి. మెదడు మానవ శరీరము యొక్క సి.పి.యూ అని పిలువబడుతోంది. ఇది 24 గంటలూ పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఇది పనిచేస్తూనే ఉంటుంది. కానీ స్ట్రెస్, విసుగు, ఎక్కువ పనులు, నెగటివ్ ఆలొచనలూ, పొగ త్రాగుట, ఆల్కహాల్ తీసుకొనుట, సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం లాంటివి వలన మెదడు యొక్క ఫిట్ నెస్ తగ్గుతుంది...............................కాని మెదడును ప్యారాచ్యూట్ తో పోల్చేరు. ప్యారాచ్యూట్ లాగానే మెదడు కూడా తెరుచుకుని ఉన్నప్పుడే బాగా పనిచేస్తుంది. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ, జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది. మెదడును పూర్తిగా వినియోగించుకోవాలంటే మెదడు ఫిట్ గా ఉండాలి. మెదడును ఫిట్ గా ఉంచుకోవటానికి మెదడుకు కొన్ని వ్యాయామాలు.
మెడిటేషన్.....ఇది ఏకాగ్రతను పెంచుతుంది. కేంద్రీకరణంలో సహాయపడుతుంది. మెదడును బలపరుస్తుంది. మెదడు స్వాధీనంలోకి వచ్చి శరీర అవయవాలను చురుకుగా ఉంచుతుంది. ఏ సమయములోనైనా సరే రోజుకు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయ వచ్చు.
మెదడుకు కావలసిన మేత.........పదకేళి, సూడోకో మరియూ క్విజ్ లూ మెదడును ఎప్పుడూ అలెర్ట్ గా ఉంచుతాయి. మీకు వీలు దొరికినప్పుడల్లా వీటిని ప్రాక్టీస్ చేసుకోండి.
శారీరక వ్యాయామం.....శరీరక వ్యాయామం మెదడు లోని పార్టులనన్నింటినీ కలిసి కట్టుగా పనిచేయిస్తుంది.
నిద్ర.....మెదడు ఫిట్ గా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. 6 నుండి 8 గంటలు తప్పక నిద్రపోవాలి( ఎక్కువసేపు నిద్ర పోవటం హాని కలిగిస్తుందని గుర్తుంచుకోండి).
పోషక ఆహారం......పోషక ఆహారం మెదడుకు చాలా మేలు చేస్తుంది. జంక్ ఫుడ్, అయిలీ ఫుడ్, పొగ త్రాగుట, ఆల్కహాల్ మెదడు యొక్క చురుకుదనాన్ని తగ్గిస్తుంది.
పాసిటివ్ ఆలోచనలు.....ఇది మెదడుకు చాలా మేలు చేస్తుంది. నిశ్చింతగా ఉండాలంటే మీ కష్టాలనూ, భాదలనూ, దుఃఖం మరియూ సంతోషాలను మీ మనిషి అనుకున్నవారి దగ్గర పంచుకోండి. మనం చేయలేనిదనేది ఏమీ లేదు.
నవ్వు.....నవ్వు మెదడుకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కనుక హాయిగా నవ్వుకోండి. ఇతరులను నవ్వించండి.
కొత్త ప్రావీణ్యతలను నేర్చుకోండి- హాబీలకు సమయం కేటాయించండి......కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోండి. మీ హాబీలకు సమయం కేటాయించండి.

1 comment: