Tuesday, May 29, 2012

కన్నీళ్ళతో తయారుచేసిన ఉప్పు?...వివరాలు మరియూ ఫోటోలు

కన్నీళ్ళతో తయారుచేసిన ఉప్పును మీరైతే ఆహారంలో వాడతారా?

"ఏ నీళ్ళూ దొరకని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలి" అన్నాడో కవి.కన్నీరు ఆరోగ్యానికి పన్నీరని, ఏడిస్తే అనారోగ్యం దూరం అవుతుందనీ, ప్రశాంతత చేకూరుతుందనీ పరిశోధనల్లో వెల్లడి అయ్యిందట. ఆరోగ్యంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి. వెక్కివెక్కి ఏడ్వండి. ఉద్వేగాలను దాచుకుని బాధ పడటం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.కన్నీళ్లలో ప్రొటీన్లు, మాంగనీసు, పొటాషియం, హార్మోన్లు, ప్రొలాక్టిన్ ఉంటాయి. మాంగనీసు అత్యవసరమైన పోషక పదార్థం. రక్తం గడ్డ కట్టడానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి, కొలెస్ట్రాల్ (కొవ్వు)ను తగ్గించడానికి కొద్ది మోతాదు మాంగనీసు సరిపోతుంది. నరాలు పనిచేయడానికి, కండరాల నియంత్రించడానికి, బీపీని అదుపులో ఉంచడానికి పొటాషియం ఉపకరిస్తుంది. ఒత్తిడి నివారించడానికి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, వివిధ అవయవాలను ప్రభావవంతంగా పనిచేయించడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఉపకరిస్తుంది.

బహుశ ఇది మనసులో పెట్టుకునే కన్నీటి ఉప్పు తాయరౌతొందేమో?

5 రకాల మానవ కన్నీరుతో లండన్ లో ఒక కంపెనీ ఉప్పును తయారుచేసి అమ్ముతోంది. "మీ పెదవుల మీద పడే కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులూ గెలువలేవు" అనే సంకేతంతో 5 రకాల కన్నీటితో ఉప్పును తయారుచేస్తోంది హాక్ స్టన్ స్ట్రీట్ మాన్ స్టార్ సప్లై కంపెనీ . ఒక బాటిల్ కన్నీటి ఉప్పు వెల రూ.500/-. "కన్నీళ్ళతో ఉప్పు తయారుచేయడం కొత్త పద్దతేమీ కాదు. ప్రాచీన పద్దతే. కన్నీటిని మరగ పెడితే, అది క్రిస్టల్స్ గా మారుతుంది. వాటిని సుద్ద పరిస్తే ఉప్పు దొరుకుతుంది. వాటికి సువాసనలు కలుపుతాము" అని వారు చెబుతున్నారు.


No comments:

Post a Comment