Sunday, May 27, 2012

రాతి గుడిసలతో నడి సముద్రంలో ఉన్న పురాతణ మఠం....ఫోటోలు

ఐర్లాండ్ సముద్రతీరానికి 12 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రములో "స్కెల్లిగ్ మికేల్" అనే రాతి ద్వీపం ఉన్నది. 7 వ శతాబ్ధమునకు చెందిన ఈ రాతి ద్వీపం యొక్క ఎత్తైన అంచు సుమారు 230 మీటర్ల ఎత్తుకు ఉంటుంది. ఇక్కడ 600 సంవత్సరాలుగా ఐరిస్ క్రైశ్తవ సాధువులు ఉండేవారు. వీరంతా అక్కడ రాతి గుడిసలు అమర్చుకుని ఉండేవారు. ఆ రోజుల్లో ఈ రాతి ద్వీపం ప్రపంచానికి దూరంగా ఉండేది. పిరమిడ్లలాంటి రాతి గ్రుహాలలో నివసించటం ఆ రోజులలోని ఆచారాలను తెలుపుతోంది. అక్కడి వాతావరణం ఆ రోజుల్లో సాధువుల వైరాగ్య జీవిత శైలి ని తెలుపుతోంది. సముద్రంలో దూరంగా ఉన్న ఈ రాతి ద్వీపానికి ఈ మధ్య వరకు ఎవరూ వెళ్ళేవారు కారు. అందువలన ఈ ప్రదేశం చెక్కుచెదరకుండా ఇప్పటికీ పూర్వీక వాతావరణం కలిగి ఉంటుంది. ......12 వ శతాబ్ధము వరకు ఈ ద్వీపంలో సాధువులు ఉండేవారట. ఆ తరువాత వాతావరణ మార్పిడి వలన ఏర్పడిన తుఫానలూ,ఉప్పెనలూ ఈ ద్వీపాన్ని తాకడం వలన వారంతా అక్కడి నుండి ఐర్లాండుకు తరలి వెళ్లేరు. ఆ తరువాత అక్కడ మఠం లేకపోవడంతో ఈ ద్వీపం తీర్ధయాత్రా స్థలం అయ్యింది. క్రిష్టియన్ మతస్థులు ప్రతిసంవత్సరములోనున్న వుపవాసముగావుండే నలభై దినాల వ్రతము (యిది ముఖ్యముగా మార్చి-ఏప్రిల్ నెలలో వస్తుంది) సమయములో వారు పెళ్ళిల్లు చేసుకోరు. ఆ సమయములో ఈ ద్వీపానికి వచ్చి పెళ్లిచేసుకుంటే తప్పులేదని అక్కడకు వచ్చి పెళ్ళిచేసుకుంటున్నారట. ఇప్పుడు ఇది ఐరిస్ వారి ఆధీనంలో ఉన్నది.


No comments:

Post a Comment