Wednesday, May 23, 2012

ఇది ఏ ఖండమో ఊహించండి...ఫోటోలు

ఈ ఫోటోలు చూసిన వెంటనే ఇది ఆఫ్రికా ఖండమని చెప్పేస్తారు. ఇందులో ఒక ఇంటెరెస్టింగ్ న్యూస్ ఉన్నది. ఆఫ్రికా ఖండములోని ఇతియోపియా లో ఉన్నటువంటి అఫార్ అనే చోట భూమి 60 కిలోమీటర్ల దూరం వరకు సన్నగా బీటు ఇచ్చింది. పలు దేశాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు ఆ బీటును పరిశోదించి ఆ బీటు ఆఫ్రికా ఖండం రెండుగా విడిపోవటానికే నని నిర్ణయానికి వచ్చేరు. రాయల్ సోసైటీ శాస్త్రవేత్తలు అక్కడ భూమి క్రింద కొత్త సముద్రం ఉన్నదని, అది పైకి రావటానికి ప్రయత్నిస్తోందని, ఆ కారణంగానే భూమి బీటు ఇచ్చిందని, మరో 10 మిల్లియన్ సంవత్సరాలలో ఆఫ్రికా ఖండం ఇక్కడే రెండుగా విడిపోయి కొత్త ఖండం ఏర్పడుతుందని వివరించేరు. అప్పుడు మీరు చూస్తున్న ఈ చోటు(అఫార్) కొత్త ఖండంలో ఉంటుంది.


3 comments:

  1. Africa definitely and most probably Sudan \Ethiopia and central Africa.(Victoria waterfalls?)

    ReplyDelete
  2. మరి బీటు ఉన్న ప్రాంతం చూపిస్తారేమో అనుకున్నాను. nevermind.. మీరు సేకరించే ఫోటోలు దాదాపు గా అన్నీ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.

    ReplyDelete
  3. ఫొటోస్, మేటర్ అన్ని చాలా బాగున్నాయి

    ReplyDelete