Monday, May 21, 2012

ఈ మధ్య అంతరిక్ష పరిశోధనలో తెలుసుకొన్నవి.....ఫోటోలు

టెక్నాలజీ అభివ్రుద్ది చెందుతూండటంతో అంతరిక్షం గురించిన పరిశోధనలు సులువైనై అని చెప్పవచ్చు. అంతరిక్షం ఎప్పుడూ మానవునికి ఒక అంతు పట్టని విషయంగా నే ఉంటోంది. అయితే ఈ మధ్య టెక్నాలజీ ని ఉపయోగించుకుని అంతరిక్షం గురించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. వాటి గురించి మనం కూడా తెలుసుకుందాం.

‘కెప్లర్ 22-బి’ …మనసౌరవ్యవస్థకు సుదూరంగా మరో భూగోళాన్ని పోలిన గ్రహం ఉన్నట్లు ఖగోళశాస్తవ్రేత్తలు ధృవీకరించారు. ఇది నివాసయోగ్యమైనది కావచ్చునని భవిష్యత్లో మానవులు అక్కడ కూడా ఇళ్లు కట్టుకుని ఉండవచ్చునని కూడా వాళ్లు చెబుతున్నారు. భూమిని పోలిన ఈ గ్రహం ‘కెప్లర్ 22-బి’ భూమికంటె 2.4 రెట్లు పెద్దదని, 600 కాంతి సంవత్సరాలు దూరంగా సౌరవ్యవస్థకు ఆవల ఇది ఉందని, దీనిపై 22 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉందని వీరి పరిశోధనలో తేలింది. ఇది ఇంచుమించుగా మన భూమిని పోలి ఉందని నాసా శాస్తవ్రేత్తలు వెల్లడించారు.

మరో సూర్య కుటుంబం... మన సూర్య కుటుంబానికి ఆవలమరో సూర్య కుటుంబం ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ కూడా ఎన్నో గ్రహాలూ, నక్షత్రాలూ ఉన్నట్లు తెలుసుకున్నారు. దీనిని ఎక్స్ ట్రా సోలార్ ప్లానెట్ అని పిలుస్తున్నారు.. ప్రాణులు జీవించడానికి అన్ని విధాలా అనుకూల పరిస్తితులు ఇక్కడ ఉన్నట్లు కనుగొన్నారు.

డార్క్ ఎనర్జీ.....ఖగోళ శాస్త్రంలలో మరియు అంతరిక్ష యాంత్రిక శాస్త్రంలో, డార్క్ ఎనర్జీ -అదృశ్య శక్తి- అనేది ప్రతిపాదించబడిన ఒక శక్తి స్వరూపం. అది విశ్వాంతరాళమంతా వ్యాపించి, విశ్వ విస్తరణ రేటును పెంచుతుందని ప్రతిపాదించబడింది. విశ్వం ఒక త్వరణ రేటుతో విస్తరిస్తున్నట్లుగా గోచరిస్తోందని చెబుతున్న పరిశీలనలు, ప్రయోగాలని వివరించేందుకు, డార్క్ ఎనర్జీ అనేది మిక్కిలి ప్రసిద్ధి చెందిన పద్ధతి.

శనిగ్రహ చంద్రుడు(ఎనె్సలాడెస్.) ………శనిగ్రహ చంద్రుడి మీద నీటి జాడ ఉందని తేల్చిన శాస్తవ్రేత్తలు, తాజాగా అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసే దిశగా పరుగులు తీస్తున్నారు. శనిగ్రహం ఆరో చంద్రుడైన ఎనె్సలాడస్ మీద నీటి జాడలు ఎక్కువగానే ఉన్నాయంటూ ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేస్తుండటంతో -ఖగోళ శాస్తజ్ఞ్రుల దృష్టి ఇప్పుడు పూర్తిగా అటు మళ్లింది. ‘జీవ మనుగడకు అవసరమయ్యే ముఖ్యాంశాలు కొన్ని శని చంద్రుడి మీద కనుగొన్నాం’ అంటూ లండన్ వర్శిటీలోని ముల్లాడ్ ఖగోళ శాస్త్ర ప్రయోగశాల శాస్తవ్రేత్తల బృందం కొన్ని ఆధారాలతో ఇప్పటికే ప్రకటించింది.

అంగారక గ్రహంలో నీరు.. ….అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)వారు, అంగారక గ్రహం మీద సుమారు మూడు సంవత్సరాల క్రితం ఒక పరిశోధక యంత్రాన్ని వదిలివచ్చారు. ‘ఆపర్చునిటీ’ అనే ఈ బండి అంగారక గ్రహం మీద తిరుగుతూ కనిపించిన సమాచారాన్ని భూమికి అందించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ రోవర్ ఈ మధ్యన అంగారక గ్రహం మీద ‘ఎండియెవర్’ అనే క్రేటర్ (పెద్ద గుంట) అంచులకు చేరింది. ఇంతకు ముందెన్నడూ చూడని జలాల గురించి అది పరిశీలనలు మొదలుపెట్టింది. 2011 లో అంగారక గ్రహంలో నీటి పారుదల ఉన్నదని ఖచ్చితంగా తెలుపబడింది.

ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)......ఇది మరుగుజ్జు గ్రహాలలో అతిపెద్దదైనది. ప్లూటో కంటే పెద్దది. సూర్యుని చుట్టూ తిరిగే శరీరాలలో దేహరీత్యా తొమ్మిదవది. దీని వ్యాసము సుమారు 2,500 కి.మీ. మరియు ప్లూటో బరువుకన్నా 27% ఎక్కువ బరువు గలది .దీనిని 10 వ గ్రహంగా వర్ణించేరు.2003 లో దీనిని ప్రథమంగా గమనించారు. కానీ 2005 లో గుర్తించారు. ఇది నెప్ట్యూన్ గ్రహానికి ఆవలివైపు గలదు. దీనికి ఒక సహజ సిద్ధ ఉపగ్రహం (చంద్రుడు) గలదు, దీని పేరు డిస్నోమియా. ఈ ఎరిస్, క్యూపర్ బెల్ట్ కు ఆవల గల విసరబడ్డ డిస్క్ లో గలదు. తోకచుక్కల ప్రాంతమైన ఈ విసరబడ్డ డిస్క్ లో ఎరిస్ ప్రదేశానికి మన సూర్యుడికి మధ్య దూరం 96.7 అంతరిక్ష మానాలు.ఇది ప్లూటో కన్నా పెద్దదిగా వున్నందున NASA వారు దీనిని సౌరమండలము లోని పదవ గ్రహంగా అభివర్ణించారు.

చంద్ర మండలం లో నీరు ……చంద్ర మండలంపై భారత మూన్ మిషన్ చంద్రయాన్ - 1 జలం ఆనవాళ్లను కనిపెట్టింది.. చంద్రయాన్ చంద్రమండలంపై నీరు ఉన్నట్లు తెలిపిన విషయంపై మాట్లాడడానికి బ్రౌన్ విశ్వవిద్యాలయం అధికార ప్రతినిధి నిరాకరించారు. అది భారీ ప్రకటన అవుతుందని, చంద్రయాన్ కు సంబంధించి అది గొప్ప ఫలితమని, భారత అంతరిక్ష పరిశోధనలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం అవుతుందని ఆయన అన్నారు.ఇప్పుడు నాసా వారు చాంద్రాయన్ చెప్పింది నిజమేనని అధికారపూర్వంగా ఉప్పుకున్నారు.

ప్లూటోను చుట్టు తిరుగుతున్న కొత్త చంద్ర గ్రహాలు. …….ప్లూటో సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం. దీని ఉపరితల ఉషోణ్రగతలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, దీని చుట్టూ ఉన్న వాతావరణంలో న త్రజని వాయువు ఉండటం విశేషం. మన సౌర వ్యవస్థలో అతిచిన్న గ్రహమే కాకుండా, సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం కూడా. అయతే దీన్ని అధికారికంగా గ్రహంగా గుర్తించడం లేదు. 2006నుంచి ప్లూటోను అతిచిన్న గ్రహంగా శాస్తవ్రేత్తలు పరిగణిస్తూ వస్తున్నారు. ప్లూటో ను చుడుతున్న చోరాన్ మొదతి చంద్ర గ్రహం కనుగొన్నారు. అయితే ఈ మధ్య ప్లూటోను 4 చంద్రగ్రాహలు చుడుతున్నాయని తెలిసింది.

1 comment:

  1. last nuchi 2nd pic..

    Fack Pic Ani naaku anumanam meeru emi antaru?

    meeru kuda okasari gamaninchandi

    fack ani meeku kuda telustundi..

    ReplyDelete