ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Saturday, May 19, 2012
నిరసన పోరాటాలు చేసే వారి మీద రంగు నీటి తూటాలు....ఫోటోలు
నిరసన పోరాటాలు చేసే వారిని చెదరగొట్టడానికి పోలీసులు నీటి తూటాలు(water canon) వాడటం మీకు తెలిసే ఉంటుంది. అలాంటి ఫోటోలు కూడా మీరు చూసే ఉంటారు. ఒక విధంగా చూస్తే లాటీ చార్జ్ కంటే ఇది ఎంతో నయం. కానీ ఈ మధ్య రంగు నీటి తుటాలు వాడటం చేస్తున్నారు. ఇది ఎందుకంటే వారు ఉపయోగించే రంగు పోరాటకుల మీద అతుక్కు పోతుంది. త్వరగా ఆ రంగును తుడిపేసుకోలేరు. పోరాటకులు చెదిరిపోయినా ఆ రంగు ఎవరి మీద కనిపిస్తే వారు పోరాటంలో పాల్గొన్నారని కనిపెట్టి వారిని ఖైదుచేసి చర్య తీసుకోవడానికి. ఇది ఒక విధంగా పోరాటాలను అనగ ద్రొక్కటానికే.
మొదటి సారిగా 1989 లో సౌత్ ఆఫ్రికన్ ప్రభుత్వం జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుల మీద ఉపయోగించింది. గత 15 సంవత్సరాలలో హంగేరీ, ఇండోనేషియా, అర్జెంటీనా, ఇండియా, మలేసియా మరియూ ఇజ్రేల్ దేశ ప్రభుత్వాలు పోరాటకుల మీద ఈ రంగు నీటి తూటాలను వాడేరు.
ఉగండాలో(2011)......ధరల పెరుగుదలను ఖండిస్తూ నిరసన తెలుయజేస్తున్నప్పుడు.
బంగ్లాదేశ్...2011
పాలస్తీనియా...2006 లో
కాష్మీర్...2011 లో ప్రభుత్వ ఉద్యోగలపై.
2006 ఇజ్రేల్ సరిహద్దులో
బుడాపెస్ట్...హంగేరీ....2006 లో
కాష్మీర్.....2008 లో
సౌత్ కొరియా 2008 లో
ఊగాండా...2011లో
కాష్మీర్.....2012 లో
శ్రీ నగర్....2012 లో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment