Thursday, May 10, 2012

పడిపోతున్న రూపాయి విలువను మన ప్రభుత్వం పెంచగలదా?...కష్టం అంటున్నారు ఎకనామిస్టులు!!!...ఫోటోలు

డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ పతనం యదేచ్ఛగా కొనసాగుతోంది. గురువారం నాటి ట్రేడింగ్లో రూపాయి మారకం విలువ వేగంగా 54కు చేరువైంది. ట్రేడింగ్ ముగియడానికి ముందు ఆర్బిఐ జోక్యంతో 53.41/42 వద్ద ముగిసింది. రూపాయి చరిత్రలో రెండవ అతిపెద్ద పతనంగా నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ పతనం ఇంతటితో ఆగుతుందా?... ఆగదు అంటున్నారు ఎకనామిస్టులు. మరో 3 నెలలో రూపాయ విలువ మరింత పతనమై 57 కు చేరుకుంటుందని చెబుతున్నారు.
ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటినుండి ఈ రోజు దాకా రూపాయి పతనం 7.2 శాతం తగ్గింది. దీనితో రూపాయి విలువ మరింత బలహీనపడి చైనా , బ్రెజిల్ మరియూ సౌత్ ఆఫ్రికా వారి కరెన్సీలకంటే కూడా విలువ కోల్పోయింది. ఈ దేశాల కరెన్సీ విలువలు ఈ సంవత్సరం పెరిగినై. ఎందుకంటే ఈ దేశాలు ఈ సంవత్సరం అభివ్రుద్ది వైపు పయనిస్తున్నాయి. మామూలుగా ఏ దేశానికైన వారి కరెంట్ అకౌంట్ లోటు 3 శాతం ఉండవచ్చు. కానీ మన దేశ కరెంట్ అకౌంట్ లోటు 4.3 శాతంతో హీనస్తితిలో ఉన్నది.
రూపాయి విలువ మెరుగుపడాలంటే దేశీయ ఆర్ధిక వ్యవస్థ ముందు మెరుగుపడాలి.
ముఖ్యంగా వ్యవ సాయ ప్రధానమైన భారత్ వంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్ధ కలిగిన దేశాలు తొలి నుంచి తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రణాళికాబద్ధమైన విధానాలను అనుసరించడంలో అప్రమత్తంగా వ్యవహరించ కలిగితే అన్ని విధాల అభివృద్ధి చెంది దీర్ఘకాలంలో సంక్షోభంలో కూరుకుపోయే పరిస్ధితి ఏర్పడదు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నది. అయినా దేశ పరిస్ధితులు భౌతికంగా అభివృద్ధి చెందినట్లు కన్పించి నప్పటికీ, అంతర్లీనంగా అభివ్రుద్ది చెందనట్లే.
“అంతర్జాతీయ దేశీయ ఆర్థిక పరిణా మాలు రూపాయి విలువను తగ్గిస్తున్నాయి” అని ప్రభుత్వం చెబుతున్నది. ఇది నిజం కాదు. ధరల పెరుగుదల, ఎగుమతులు, దిగుమతులు, విదేశాంగ వాణిజ్యం, వ్యవసాయ రంగ పురోగమన, తిరోగమనాలు, పరపతి, ద్రవ్య విధానాలు ఇలా ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ముందడుగు వేయాలి. అప్పుడే మన దేశ ఆర్ధీక వ్యవస్త మెరుగు పడుతుంది. రూపాయి విలువ పెరుగుతుంది. ఫోటో క్రెడిట్: anilselarka.com

No comments:

Post a Comment