Wednesday, May 2, 2012

జంతువుల మీద పరిశోధనలకు నిరసనగా...మనిషి మీద పరిశోధన..!!!...ఫోటోలు

సౌందర్య ద్రవ్యాలు తయారుచేస్తున్న కంపెనీలు తాము కొత్తగా తయారుచేసే ద్రవ్యాలను మొట్టమొదట జంతువుల మీద పరిశోధిస్తున్నారు. వీరి పరిశోధనల మూలంగా ఎన్నో చిన్న జంతువులు బలైపోతున్నాయి. జంతువుల మీద పరిశోధనలు ఆపాలని జంతు సమ్రక్షణా సంఘాలు నిరసనలూ, పోరటాలూ చేస్తున్నాయి. కొన్ని దేశాలలో ప్రభుత్వాలే ఇలాంటి పరిశోధనలను నిషేదించేయి. కానీ కొన్ని పెద్ద దేశాలలో జంతువుల మీద పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలలో ఈ కంపెనీల మీద అసంత్రుప్తి ఎక్కువైంది. నొప్పిని బయటకు తెలుపలేని జంతువుల మీద పరిశోధనలు ఎంత క్రూరంగా ఉంటాయో ప్రజలకు ప్రత్యక్షంగా చూపాలని, తాము తమ కంపెనీలో జంతువుల మీద పరిశోధనలు జరపటంలేదని, తాము గూడా జంతువులపై పరిశోదనలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రజలకు తెలుపటానికి లండన్లోని "లష్ కాస్మోటిక్స్" కంపెనీ తమ షాపులో బహిరంగంగా ఒక మనిషి మీద ప్రజల కళ్ల ముందు ప్రత్యక్షంగా పరిశోధన జరిపేరు. ఇలా చేయడంతో ఇది ప్రజలలొ అత్యంత వివాదస్పధ సంఘటనగా తలెత్తింది.ఆ కంపెనీ మీద చట్ట పూరిత చర్యలు చేపడుతున్నారు......ఇలా చేయడం న్యాయమేనా?

No comments:

Post a Comment