Tuesday, May 15, 2012

ఒక ఐస్ క్రీం 50,000 రూపాయలంటే నమ్మలేదు, ఇప్పుడు ఒక ఐస్ క్రీం 12 లక్షలు!!!...ఫోటోలు

కొన్ని రోజుల క్రితం 50,000 రూపాయలు ఖరీదుగల ఒక ఐస్ క్రీం ఉన్నదని చెబితే నమ్మలేక పోయేను. ఐతే అది గిన్నిస్ రెకార్డ్ లోకి ఎక్కిన తరువాత నమ్మేను. ఇప్పుడు 12 లక్షల ఖరీదు చేసే ఒక ఐస్ క్రీం ఉన్నదని తెలిసింది. వెంటనే వాటి వివరాలు తెలుసుకోవాలనిపించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

50,000 రూపాయల ఐస్ క్రీం...... 3 సంవత్సరల క్రితం ఈ ఐస్ క్రీం ను న్యూ యార్క్ నగరంలోని ఒక ప్రసిద్దిచెందిన రెస్టారంట్ ప్రవేశ పెట్టింది. ఆ తరువాత ఈ ఐస్ క్రీం ను రకరకాలుగా మార్పులుచేసి మరెన్నో రెస్టారెంట్లు ప్రవేశపెట్టేయ్. ఈ ఐస్ క్రీం లో అత్యంత ఖరీదైన అన్ని రకాల ఐస్ క్రీం కలియకలతో పాటూ 24 క్యారట్ల బంగారు (తినడానికి ఉపయొగపడే) రేకులు కలిగి ఉంటాయి. ఈ ఐస్ క్రీం తినాలనుకునేవారు, రెస్టారెంట్లలో ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. ఐస్ క్రీం రెడీ అయిన వెంటనే వారికి కబురు వెడుతుంది.

ఇది ఇలా ఉండగా ఈ మధ్య 12 లక్షల రూపాయలు విలువచేసే ఐస్ క్రీం ను తయారు చెసేరు. ఈ ఐస్ క్రీం లో 28 రకాల కోకోలు కలిపేరట. అందులో 14 రకాలు అత్యంత ఖరీదైన, అరుదైన కోకోలట. ఈ ఐస్ క్రీం తో పాటు 23 క్యారట్ల బంగారం 5 గ్రాములు కలిపేరట. దీనితో పాటు ఐస్ క్రీం గ్లాస్ కప్పు కు 18 క్యారట్ల బంగారు బ్రేస్ లెట్ ఉంచుతారు. ఈ బ్రేస్ లెట్ లో 1 క్యారట్ డైమెండ్లు పొదగబడి ఉంటాయి. ఐస్ క్రీం తినడానికి చాక్లెట్ రంగులు కలిగిన రాళ్లతో కూడిన బంగారు స్పూన్ ఇస్తారు. ఐస్ క్రీం తిన్న తరువాత ఆ బ్రేస్ లెట్ మరియూ బంగారు స్పూన్ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.

ఇది కాకుండా మరో చోట 1,50,000 రూపాయల విలువగల ఐస్ క్రీం తయారుచేస్తున్నారు.

No comments:

Post a Comment