Monday, May 28, 2012

నాసా వారు తయారుచేసిన 2 అద్భుత అంతరిక్ష పానీయాలు...ఒకటి అమ్మకానికి తయారు...వివరాలు

నాసా వారు రోదసిలో నెలల తరబడి గడిపే వ్యోమగాములపై అణుధార్మిక ప్రభావాన్ని నిరోధించేందుకు ఉద్దేశించి వారికోసం 2 పానీయాలు తయారుచేసేరు.


ఒకటి ఎనర్జీ పానీయం, మరొకటి వ్యాధి నిరోధక పానీయం. రెండు పానీయాలూ అద్భుత ఫలితాలు ఇవ్వడంతో వాటిని సాదారణ ప్రజలు కూడా అందించాలని నిర్నయించేరు. మొట్టమొదట తయారుచేసిన ఎనర్జీ డ్రింక్ ను తయారుచేసి అమ్మకానికి ఉంచేందుకు "బౌల్డర్" అనే కంపెనీకి లైసన్స్ ఇచ్హేరు. త్వరలో ఆ ఎనర్జీ డ్రింక్ "ది రైట్ స్టఫ్" అనే పేరుతో మార్కెట్లో ఉంటుంది.


రెండవ పానీయం:… ఇదో అద్భుత 'అంతరిక్ష పానీయం' (స్పేస్ డ్రింక్). నాలుగు నెలలపాటు రోజూ రెండు డోసులు సేవిస్తే చాలు... శరీరంమీది మచ్చలు, ముడతలు మటుమాయం. ఇది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వినూత్న ఆవిష్కారం. రోదసిలో నెలల తరబడి గడిపే వ్యోమగాములపై అణుధార్మిక ప్రభావాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన ఈ పానీయానికి 'ఏఎస్10'గా శాస్త్రవేత్తలు పేరుపెట్టారు. దీని ప్రభావంపై ఉటా విశ్వవిద్యాలయంలో 180 మందిపై పరిశోధన నిర్వహించారు.

నాలుగు నెలలపాటు ఈ పానీయం తీసుకున్న తర్వాత వారి శరీరాలపై మచ్చలు, ముడతలు మాయం కావడంతో శాస్త్రవేత్తలు అమితానందం వ్యక్తం చేశారు. అలాగే ప్రయోగానికి ముందు వారి చర్మ అంతర్భాగాన్ని చిత్రీకరించి, ఆ తర్వాత తీసిన చిత్రాలతో పో ల్చినపుడు అతి నీలలోహిత మచ్చలు 30 శాతం, ముడతలు 17 శాతం తగ్గిపోయినట్లు గుర్తించారు. భూ వాతావరణ వెలుపల అత్యంత తీవ్రస్థాయి రేడియేషన్ నుంచి వ్యోమగాములను రక్షించే ప్రత్యామ్నాయ అనుబంధ పోషకంగా 'ఏఎస్10'ను రూపొందించారు.


బ్రెజిల్లో లభ్యమయ్యే 'క్యుపువాక్యు' పండుతోపాటు మరో నాలుగైదు రకాల పండ్లనుంచి తీసిన విటమిన్ పదార్థాలతో దీన్ని తయారుచేశారు. అటుపైన ద్రాక్ష, దానిమ్మ, గ్రీన్ టీ, కూరగాయలలోని పదార్థాలతో సమ్మిళితం చేశారు. అణుధార్మికత ప్రభావంతో శరీరంలోని ఆక్సిజన్ పరమాణువులు ప్రతిస్పందిత పరమాణువులు (ఆర్వోఎస్)గా మారిపోతాయి. 'ఫ్రీ రాడికల్స్'గా వ్యవహరించే వీటివల్లనే కేన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు సోకుతాయి. వయసు మీదపడటంలోనూ వీటి పాత్ర ఉన్నదని, వీటిని ఏఎస్10 అరికడుతుందని తేలినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఆరాన్ బార్సన్ తెలిపారు. . ఈ పానీయాన్ని "యాంటీ-ఏజింగ్" పానీయముగా కూడా తీర్మానించేరు. ఐతే దీనిని సాదారణ ప్రజలకు అందుబాటులో ఉంచుతారో లేదో తెలుపలేదు.

No comments:

Post a Comment