Thursday, April 19, 2012

నిన్న పెరూదేశంలో కప్ప జ్యూస్-----ఈరోజు భారతదేశంలో కప్పల పెళ్ళి.....ఫోటోలు

నిన్న పెరూ దేశంలో కప్పను జ్యూస్ చేసి తాగటం గురించి తెలుసుకున్నారు. ఈరోజు భారతదేశంలో కప్పలకు పెళ్లి జరపటం గురించి తెలుసుకోండి.....అస్సాం రాష్ట్రంలో నిన్న రెండు కప్పలకు పెళ్ళిచేసేరు. పెళ్ళి కోలాహలంగా, సాంప్రదాయంగా, వందలమంది సమక్షంలో,ప్రజల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది. కప్పలకు పెళ్లి జరపటమేమిటా అనుకుంటున్నారా?..కారణముంది. కప్పలకు సాంప్రదయకంగా పెళ్ళి జరిపితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనీ, వర్షాలు బాగా పడతాయని, నీటి కరువు ఉండదని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. అక్కడి ప్రజలు మాత్రమే కాదు, బంగ్లాదేశ్ దేశంలో కూడా ఈ నమ్మకం ఎక్కువగా ఉన్నది. పెళ్లి ఏదో సింపిల్ గా అయిందనిపిచ్చకుండా, సాంప్రదాయపూర్వకంగా జరిపి, ఆ కప్పలను ఆశీర్వదించి మళ్లీ నీటిలో వదిలేసేరు.

3 comments:

  1. పెళ్ళి చేసి నీళ్ళలో వదిలేశారా?! ప్చ్... మిక్సిలో గిలకొట్టి తాగి వదిలేయలేదూ? :))

    ReplyDelete
  2. వర్షం బాగా పడాలని ముఖ్యంగా వేసవి కాలంలో మా ఊరిలో కూడా కప్పల కు పెళ్లి చేస్తారు. ఒక వెన్నల రాత్రి రెండు కప్పలను ఒక మట్టి కొండలో ఉంచి మా ఊరి వీదుల్లో డప్పు మేళాలతో ఊరేగింపు చేసి చెరువులో వదులు తారు. కాని ఈ ఊరేగింపులో అందరూ ఏడ్చే వారే! మా ప్రక్క గ్రామాల్లో కూడా చేస్తారను కొంటాను.

    ReplyDelete
    Replies
    1. e voori lo chestaaru need info for short film..

      Delete