Tuesday, April 17, 2012

ఎక్స్ ట్రాక్టో-డి-రానా: కప్ప జ్యూస్....పెరూ దేశంలో ఒక డ్రింకు.........ఫోటోలు

నిజమే. మీరు చదివింది కరెక్టే. కప్ప జ్యూస్. ఇది ఒక జ్యూస్ పేరు కాదు. కప్పలతో తయారుచేసే జ్యూస్. ఆశ్చర్యంగా ఉన్నదా. కానీ ఇది నిజం. పెరూ దేశంలో చాలా మంది ప్రొద్దున్నే కాఫీకి బదులు, కప్ప జ్యూస్ తాగుతారట. ఎందుకంటే ఈ కప్ప జ్యూస్ లో మకా అనే మూలిక కలుపుతారు. ఈ జ్యూస్ తాగితే ఆస్మా, బ్రోంకాయటీస్ లాంటి వ్యాధులు తగ్గడమే కాకుండా శారీరక శక్తి, మెదడు శక్తి పెరుగుతాయట. సోమరితనం అనే మాటకే తావు ఉండదట. ఈ జ్యూస్ బార్లలోకి వెళ్ళి కూర్చున్నవెంటనే అక్కడున్న కప్పలలో ఒక కప్పను ఎన్నుకోవాలి....(చదువుతుంటేనే చీదర, రోత, అసహ్యం పుడుతొంది). మానవులను ఎదుర్కోలేని, దీనమైన ఆ కప్పను చంపేసి, దాని పై యున్న చర్మాన్ని తీసేసి, ఆ కప్పను మిక్సీలో వేసి, జ్యూస్ కి కావలసిన రసాలుపోసి, మూలికలు వేసి రెడీచేసి ఇస్తారట.

3 comments:

  1. చదవడానికే చాలా రోతగా ఉంది, అసలు వాళ్ళు మనుషులేనా?!!!

    ReplyDelete
  2. ఇలాంటివి చూసి, కప్పపండుగ చేయాల్సిందేనని వూస్‌మేనియాలో తరగతులు బహిష్కరించి రాళ్ళతో కొట్టుంటారేమో. :))

    ReplyDelete
  3. భగవంతుడా....

    మాడవ ఫొటో చూసేసరికి చాలా బాధ వేసింది

    ReplyDelete