Monday, April 30, 2012

అత్యంత ఆశ్చర్యపరిచే హోటల్లు.....ఫోటోలు

ఆకాశ బోజన హోటల్(బెల్జియం)...బ్రుసెల్స్ లో ఉన్న ఈ హోటల్ ఒక సారికి 22 మందికి మాత్రమే బోజనం పెట్టగలదు. ఎందుకంటే ఈ హోటల్ ఆకాశంలో, అంటే 150 అడుగుల ఎత్తున గాలిలో ఉంటుంది. స్పెషల్ గా తాయారుచేసిన టేబుల్స్ మరియూ కుర్చీలు కలిగి ఉన్న ఈ హోటల్ ను ఒక క్రేన్ పైకి తీసుకు వెడుతుంది. సీటు బెల్ట్ లు వేసుకుని తినాలి. ఫోర్క్ లు ఎట్టి పరిస్తితులలోనూ క్రింద పడేయకూడదు.
చీకటి హోటల్(చైనా).....చైనాలోని బీజింగ్ నగరంలో ఉన్న ఈ హోటల్ చీకటిగా ఉంటుంది. లైట్లు ఉండవు. హోటల్ లోకి అడుగు పెట్టిన వెంటనే నైట్ విజన్ కళ్లజోళ్ళు వేసుకున్న వైటర్స్ వచ్చిన వారిని బద్రంగా టేబుల్ దగ్గరకు తీసుకు వెడతారు. మెనూ కార్డ్ లోపల ఉండదు. తినడానికి వచ్చినవారు అడిగిన వాటిని వైటర్స్ తీసుకువచ్చి పెడతారు. చీకటిలోనే తినాలి. ఫ్లాష్ లైట్లు, మొబైల్ ఫోన్లు, రేడియం గడియారాలూ లోనికి తీసుకు రాకూడదు. చీకటిలో వాసన చూసి మాత్రమే తినడం వలన తినే పదార్ధాల రుచి బాగా తెలుస్తుందని అలా హోటల్ పెట్టేరు. మళ్ళీ వాష్ రూం లో మాత్రం పెద్ద లైట్లు ఉంటాయి.
శ్మాశాన హోటల్(ఇండియా).......అహమదాబాద్ లో ఉన్న ఈ న్యూ లకీ రెస్టారెంట్ టీ, బటర్ రోల్స్ మరియూ టేబుల్ల మధ్య ఉన్న సమాధులు వలన ప్రఖ్యాతి పొందింది. క్రిష్ణన్ కుట్టీ నాయర్ అనే ఆయన పురాతనమైన, పాడుబడిపోయిన మరియూ ఉపయోగంలోలేని ముస్లీం ల శ్మశాన చోటును ఉన్న రెస్టారెంట్ నడపడానికి సహాయపడ్డారు. రెస్టారెంట్ మధ్యలో ఉన్న సమాధులు ఎవరివో ఆయానకు తెలియదు. సమాధులకు పచ్చరంగు పైంట్ వేసి అలంకరించేరు. "శ్మాశానంలోకి రావడానికి అందరూ భయపడతారు. కానీ శ్మాశానంలో కూర్చుంటే మంచిదని అందరికీ తెలుసు. అక్కడ రెస్టారెంట్ మొదలుపెట్టేక అందరూ రావడం మొదలుపెట్టేరు. వ్యాపారం బాగా సాగుతోంది. ప్రఖ్యాతి పొందింది. సమాధుల మధ్య తినడానికి అందరూ ఇష్టపడుతున్నారు" అని ఆయన తెలిపేరు.
జైలు హోటల్...ఇటాలీ......ఇటాలీలోని హై సెక్యూరిటీ జైలులో Fortezza Medicea అనే హోటల్ ఉన్నది. ఆ రెస్టారెంట్ లో హత్యానేరం క్రింద యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ రోజూ పియానో వాయిస్తాడు. అతని పియానో సంగీతం అక్కడున్న జైలు అధికారులకు బాగ నచ్చింది. బయటి ప్రజలు కూడా అతని పియానో వినాలని బయట ప్రజలను జైలు రెస్టారంట్ లోకి అనుమతించేరు. అక్కడి వాతావరణం, జైలు చుట్టూ ఉన్న ఎత్తైన గోడలూ, సెక్యూరిటీ టవర్లు బయట నుండి వచ్చిన జనానికి నచ్చింది. అలా ఆ హోటల్ ప్రసిద్ది చెందడంతో, జైలు అధికారులు ఆ జైలు పేరుతో పలుచోట్ల బ్రాంచీలు తెరిచినా ప్రజలు జైలులో ఉన్న రెస్టారెంట్ కే ఎక్కువగా వస్తున్నారు. అక్కడ తినడాని ఆశ పడితే 15 రోజులకు ముందే టేబుల్ బుక్ చేసుకోవాలట.
టాయ్ లెట్ హోటల్(తైవాన్)......టాయ్ లెట్ లో హోటల్ పెట్టలేదండి... టాయ్ లెట్ ఆకారంతో హోటల్ పెట్టేరు. ఫోటోలు చూస్తున్నట్లు, అక్కడున్న ప్లేట్లూ, ఆహారం పెట్టే బొవల్స్ అనీ వెస్ట్రన్ టాయ్ లెట్ ఆకారాలలో ఉంటుంది. కుర్చీలు టాయ్ లెట్ సీట్లలాగా ఉంటాయి. టేబుల్లు బాత్ టబ్ లతో చేసినవి. ఇది అక్కడి ప్రజలకు బాగా నచ్చింది. టాయ్ లెట్ లో తినడం ఒక త్రిల్లింగ్ గా ఉన్నదని చెబుతున్నారు.
రోబో దంపతుల హోటల్(చైనా)..... పొట్టకూటికోసం మొట్టమొదట మామూలు పేరుతో ఇద్దరు అన్నదమ్ములు మొదలుపెట్టబడిన ఈ హోటల్ ప్రజలచే రోబో దంపతుల హోటల్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. కారణం, అన్నదమ్ములిద్దరూ కవలలు, వారు పెళ్ళిచేసుకున్న అమ్మాయలూ కవలలు. ఈ విషయం మొదట్లో ప్రజలకు తెలియదు. దంపతులిద్దరే హోటల్ ను 24 గంటలు ఎలా నడుపుతున్నారో అర్ధం కాలేదు. ఎప్పుడు వెళ్ళినా వారే అక్కడ కనబడేవారు. మిషన్ లాగా విశ్రాంతి తీసుకోకుండా 24 గంటలు పనిచేస్తున్న ఆ దంపతులిద్దరినీ చూసి వీరు రోబోలని తీర్మానించుకుని ప్రజలు ఆ పేరు పెట్టేరు. కొన్ని రోజుల తరువాత ఒక న్యూస్ రిపోర్టర్ ఆ దంపతులను ఇంటర్వ్యూ చేయడాని వెళ్ళినప్పుడు విషయం తెలిపేరు. దంపతులిద్దరే కాదు, మరో జంట కూడా ఉన్నదని. వారు కవలలు కావడంతో ఎవరు ఎప్పుడుంటున్నారో ప్రజలు కనుక్కోలేకపోయేరు.ఈ విషయం ప్రజలకు తెలిసింది. కానీ వారికి కోపము రాలేదు. కవల దంపతులను చూడటానికి ఆ హోటల్ కు వెలుతున్నారు. కవలలు చేత ఆహారం తింటే అద్రుష్టం వస్తుందని వారి నమ్మకం.
భూతాల హోటల్(జపాన్)...ఈ హోటల్ పూర్తిగా నెత్తుటి రంగు తో ఎర్రగా కనబడుతుంది. ఒక శవ పేటిక, దాని పైన భూతాల మాంత్రీకుని వస్తువులూ ఉంటాయి.

3 comments: