Tuesday, April 3, 2012

జపాన్ సముద్ర తీరములో నీటి మిణుగురు పురుగులు...ఫోటోలు

జపాన్ లోని టోయోమా సముద్ర తీరంలో సముద్రపు నీటిలో వేలకొలది నీటి మిణుగురు పురుగులు తీరానికి వస్తాయి. మార్చ్ నెల నుండి జూన్ నెల వరకు ఇవి తీరానికి రావడంతో వలవేసి టన్నులకొద్దీ మిణుగురు పురుగులను అక్కడి వారు పడతారు. ఒక్కొక్క నీటి మిణుగురు పురుగు 3 ఇంచ్ల సైజు మాత్రమే ఉంటుంది.ఈ పురుగులలో లైటు ఉత్పత్తిచేసే ఫోటోఫోరస్ అనే అవయవము ఉన్నది. ఈ అవయవము ఆ పురుగులలో చిక్కటి బ్లూ రంగులో వెలుతురు వెలువడిస్తుంది. ఎల్లప్పుడూ సముద్రంలో 1200 అడుగుల క్రింద మాత్రమే ఉండే ఈ నీటి మిణుగురు పురుగులు మార్చ్ నెల నుండి జూన్ నెలవరకు ఆ సముద్రములో ఏర్పడే పెద్ద అలల మూలంగా సముద్రం పై బాగానికి రావడం, తీరానికి రావడం జరుగుతుంది. వీటిని చూడటానికి టూరిస్టులు తెల్లవారుఝామున 3 గంటలకు ఆ సముద్ర తీరానికి వస్తారు.

1 comment: