Tuesday, April 10, 2012

ఫైబర్ గ్లాస్ తో చేయబడ్డ ఏనుగు విగ్రహాలు.....ఫోటోలు

ఏనుగులను జంభముగా చూపటానికి సింగపూర్ లో ఎక్జిబిషన్ పెట్టేరు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో పెడతారు.ఈసారి సింగపూర్ ఎక్జిబిషన్ లో ఫైబర్ గ్లాస్ తో చేసిన ఏనుగు విగ్రహాలకు రంగులు వేసి అలంకరించేరు. ఈ ఎక్జిబిషన్ పెట్టటానికి ఒక కారణం ఉన్నది. ఆసియా ఖండములో ఏనుగుల సంఖ్య తగ్గిపోతోంది. ఉన్న వాటిని కాపాడటానికీ, వాటి సంఖ్యను పెంచడానికి ఆసియా ఎలిఫెంట్ ఫౌండేషన్ అనే సంస్థను మొదలుపెట్టేరు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఏనుగు విగ్రహాలను ఏదో ఒక రకం ముడిసరకుతో తయారుచేసి ఎక్జిబిషన్ పెడతారు. ఎక్జిబిషన్ అయిన తరువాత ఈ విగ్రహాలను వేలం వేస్తారు. వేలం పాటలో వచ్చిన డబ్బును ఏనుగుల సంరక్షనకు వాడతారు.

1 comment: