Friday, April 20, 2012

మొదడు గురించిన నిజాలు.....ఫోటోలు

ఆవలింత....ఆవలింత మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ పంపుతుంది. దీని వలన మెదడు శాంతంగానూ, చురుకుగానూ అవుతుంది.
పిల్లల మెదడు.....పిల్లలు 5 సంవత్సరాల వయసు లోపు 2 లేక అంతకంటే ఎక్కువ భాషలు నేర్చుకోగలిగితే, వారి మెదడు యొక్క నిర్మాణ క్రమం పెద్ద వారి మెదడులాగా మారుతుంది.
విద్యుత్ శక్తి....మెలుకువగా ఉన్నప్పుడు మెదడు 10-23 వాట్స్ విద్యుత్ శక్తిని ఉత్పత్తిచేస్తుంది. ఈ శక్తి ఒక లైటును వెలిగించ గలిగినదిగా ఉంటుంది.
కొవ్వు.....మనుష్యుల అవయవాలలోనే మెదడు ఎక్కువ కొవ్వుగలిగిన అవయవం.మెదడు 60 శాతం కొవ్వు కలిగినది.
సంగీతం.....పిల్లలు సంగీతం నేర్చుకుంటే అది మెదదు యొక్క ఆలొచనా శక్తిని పెంచుతుంది.
సమాచార వేగం......మెదడులో సమాచారం గంటకు 268 మైళ్ల వెగంతో ప్రయానిస్తుంది. అయితే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ వేగం తగ్గుతుంది.
మనిషికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత మెదడు యొక్క పెరుగుదల ఆగిపోతుంది.
ఆహారం....మనిషి బరువులో 2 శాతం బరువు మాత్రమె కలిగిన మెదడు మనిషి తినే ఆహారంలో ఉన్న శక్తిలో 30 శాతం తీసుకుంటుంది.

2 comments:

  1. మంచి విషయం తెలియపరచినారు ధన్యవాదములు

    ReplyDelete
  2. ఆఆవలింతలు వసై చెడ్డది అనుకునె వాడి కాని మివలన అది మంచిదని తెలసింది

    ReplyDelete