Wednesday, April 25, 2012

ప్రపంచములోనే అధిక ఆస్తి కలిగిన రాజకీయ నాయకులు.....ఫోటోలు

ప్రపంచంలో కొన్ని వందలమంది రాజకీయ నాయకులున్నారు. కానీ వీరిలో అతి కొద్దిమందే అధిక ఆస్తి కలిగిన వారిలో చోటుచేసుకున్నారు. మనుష్యులను ఆస్తిపరులుగా చేసేది ఒక్క వ్యాపారం మాత్రమే కాదు,కొన్ని సమయాలలో రాజకీయాలు కూడా. అరబ్ దేశాలలో ఆస్తులున్న రాజకీయ నాయకులు ఎక్కువమంది ఉన్నా ఈ ధోరణి మొదలైంది ఎలిజిబత్ మహారాణితోనే...............................................................................................................................Mohammed Bin Rashid Al Maktoum........యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఎదురులేని ప్రధాణ మంత్రి. ఈయన ఆస్తి 80 బిల్లియన్ డాలర్లు. .ఈయన డబ్బును అతి దుబారాగా ఖర్చు చేస్తారు. గుఱ్ఱపు పందేలలో ఎక్కువ ఖర్చు చేసినా,ఎక్కువగ అణుకువగల మనిషిగా చెబుతారు. దారాలంగా విరాళాలు చేయడమే కాకుండా యూనైటడ్ నేషన్ కూ , సమాజ సేవకూ ఎక్కువ డబ్బు విరాళంగా ఇచ్చేరట.
Hosni Mubarak......ఈజిప్ట్.....తన దేశప్రజల తిరుగుబాట్లు, ప్రపంచ రాజకీయ వొత్తిడ్లూ వలన ప్రెశిడెంట్ పదవికి రాజీనామా చేసినా హోస్నీ ముబారక్ 70 బిల్లియన్ డాలర్ల ఆస్తితో రెండవ స్థానంలో ఉన్నారు. అందరూ ఈయన సంపాదించిన ఆస్తి రాజకీయ అవినీతి వలనే నని చెబుతున్నారు.
Vladimir Putin...........రష్యా దేశ రాజకీయ రంగంలోనే కాకుండా ప్రపంచ రాజకీయ రంగంలో కూడా ఈయన మాటలకు విలువ ఉన్నది.ఈ చిన్న వయసు రాజకీయనాయకునికి 40 బిల్లియన్ డాలర్ల ఆస్తి ఉన్నది.
Bhumibol Adulyadej......ఎన్నో సంవత్సరాల నుండి ఈయన తాయ్లాండ్ రాజుగా ఉంటున్నారు. ఈయన ఆస్తి విలువ 35 బిల్లియన్ డాలర్లు.
Abdullah Bin Abdul Aziz...........ఈయన సౌదీ అరేబియా రాజు. ఈయన ఆస్తి 21 బిల్లియన్ డాలర్లు. ఈయన ప్రతిదేశంతోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. చాలాదేశాలలో ఈయన పెట్టుబడి పెట్టేరు.
Hassanal Bolkiah...........ఈయన బ్రూనే దరూసలాం సుల్తాన్. ఈయన ఆస్తి 20 బిల్లియన్ డాలర్లు. ఈయనకు సుమారు 1000 కార్లు ఉన్నాయట. ఎప్పుడూ విదేశాలలో తిరుగుతూ విలాసంగా ఉంటారట.
Sonia Gandhi..........అధిక ఆస్తిగల రాజకీయనాయకులలో మొట్టమొదటి మహిళ. ఇటాలీలో పుట్టిన ఈమె ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాసామ్య దేశమైన భారతదేశంలో అందరిచే గుర్తింపు పొందగలిగింది. ఈమె ఆస్తి 19 బిల్లియన్ డాలర్లు.
Khalifa Bin Zayed Al Nahyan............అరబ్ దేశాలకు చెందిన మరో డబ్బున రాజకీయ నాయకుడు. యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఈ రాజకీయ నాయకుని ఆస్తి 18 బిల్లియన్ డాలర్లు.
Silvio Berlusconi............ఇటాలీకి చెందిన ఈ రాజకీయ నాయకుడు ఆస్తి విషయంలో కంటే అవినీతిలో, అత్యాచారాలతో ప్రసిద్ది చెందేరు. ఈయన ఆస్తి 9 బిల్లియన్ డాలర్లు.

2 comments:

  1. *Mohammed Bin Rashid Al Maktoum........యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఎదురులేని ప్రధాణ మంత్రి. ఈయన ఆస్తి 80 మిల్లియన్ డాలర్లు. *

    సవరణ:

    ఈయన ఆస్తి 80 బిలియన్ డాలర్లు.

    ReplyDelete
    Replies
    1. జయహో గారికి,
      మీరు చెప్పిన సవరణ చేసేను...ధన్యవాదాలు.
      మీకొసం

      Delete