Tuesday, April 17, 2012

బ్రతికున్నప్పటికంటే చనిపోయిన తరువాతే మనుష్యులకు విలువ ఎక్కువ...!!!

"బ్రతికున్నప్పటికంటే చనిపోయినతరువాతే మనుష్యులకు విలువ ఎక్కువ" అనే దాని గురించిన విషయాలు చదివిన తరువాత మనుష్యుల లోపలి మరియూ బయట అవయవాలకు బ్లాక్ మార్కెట్లో ఎంత విలువ ఉన్నదో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన మనుష్యులను దహనం చేసేవారికంటే, పూడ్చి పేట్టేవారే ఎక్కువుగా ఉన్నారు. దీనిని అనువుగా తీసుకుని చట్టవిరోధంగా అవయవాలు అమ్ముకునే వారు రోజురోజుకూ పెరుగుతున్నారట. వైద్య శాస్త్రం అవయవాల మర్పిడి చికిత్సలో ముందడుగువేయడంతో చట్టవిరోధంగా అవయవాలు అమ్ముకునే వారికి ఇది అతిపెద్ద వ్యాపారంగా మారింది. గత 25 సంవత్సరాలలో ఈ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో ముందుకు సాగుతోందట. దీనికి అతిపెద్ద కారణం 1,13,000 మంది అవయవాల మార్పిడికోసం వైటింగ్ లిస్ట్ తో ఎదురుచూస్తుంటే కేవలం 18 మందికి మాత్రమే అవయవాల మార్పిడి జరుగుతోందట. మానవ శరీరం యొక్క విలువ ఎంత?
కళ్ళు....రూ.80,000. పుర్రె మీది చర్మం....రూ.30,000. భుజం...రూ.25,000. హ్రుదయ వాల్వులు...రూ.80,000. హ్రుదయం....రూ.60,00,000. లివర్....రూ.80,00,000. చేతులూ,వేళ్ళు.....రూ.20,000. రక్త నాళాలు....రూ.20,000.
కిడ్నీ....1,30,00,000. స్టొమక్....రూ.25,000. చిన్న పేగులు....రూ.1,25,000. గాల్ బ్లాడర్.....రూ.60,000. చర్మం...ఒక చదురపు ఇంచ్....రూ.500.
బ్లాక్ మార్కెట్లో మానవ అవయవాలను ఎక్కువగా అమ్మేది అమెరికాలో....2011 లో కేవలం 14,144 అవయవాలను మాత్రమే దానం గా పొందగలిగేరట. అవయవాల మార్పిడి చేసుకోలేక రోజుకు 18 మంది చనిపోతున్నారట.......వైద్య శాస్త్ర పరిశోధనలకు కూడా మానవ శరీరాలు అవసరం ఎంతైన ఉన్నది. 2011 లో 11,000 మంది తమ శరీరాలను చనిపోయిన తరువాత వైద్య పరిశోధనల నిమిత్తం దానం చేసేరేట.......రక్తాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికి మనుష్యులను కిడ్నాప్ చేస్తున్నారట......ఎన్నో దేశాలలో పూడ్చిపెట్టిన్ తమ బంధువుల శరీరాలు దోచుకుపోయేరని పోలీసు ఫిర్యాదులు ఉన్నాయట. పైన వివరించినవి ఒక దేశంలో జరుగుతున్న మానవ అవయవాల బ్లాక్ మార్కెట్ గురించి మాత్రమే. ఇవి ప్రతి దేశంలోనూ జరుగుతున్నాయని, అవయవాల విలువ దేశాలకు తగినట్లు మారుతున్నదట.
అవయవాలను దానం చేద్దాం...... శవాలను అమ్ముకునే బ్లాక్ మార్కెటర్లను తరిమి కొడదాం.

1 comment:

  1. ఇంకా రాష్ట్ర రాజకీయాల గురుంచి అనుకున్నాను ప్చ్

    ReplyDelete