Sunday, April 15, 2012

సముద్రం గురించి కొన్ని నిజాలు....ఫోటోలు

పసిఫిక్ మహా సముద్రం.....భూమి మీద ఉండే సముద్రాలలోనే పసిఫిక్ మహా సముద్రం అతి పెద్దది.దీని విస్తీర్ణం 165.25 మిల్లియన్ల చదురపు కిలోమీటర్లు. దీనిని ఇంకా సులువుగా అర్ధంచేసుకోవాలంటే ఇలా చెప్పవచ్చు. ఈ భూమిమీద ప్రజలు నివసిస్తున్న నేల యొక్క విస్తీర్ణంకంటే పెద్దది.
సముద్రంలలోని ఉప్పు మరియూ బంగారం.....సముద్రాలన్నిటిలోనుండీ ఉప్పును వెలికి తీస్తె అది భూమి మీదున్న నేల మొత్తాన్ని 5 అడుగుల ఎత్తువరకు నింపుతుంది....ఇంకొక నిజమేమిటంటే సముద్రాలలో ఉన్నటువంటి బంగారమును గనులు వేసి తీయ గలిగితే, ఎంత బంగారం దొరుకుతుందంటే భూమి మీదున్న ప్రతి మనిషికీ 4 కిలోల బంగారం ఇవ్వవచ్చు. ఈ రోజు మార్కెట్ రేటుకు అది సుమారు ఒక కోటి రూపాయలు.
"మౌనా కియా"...అతిపెద్ద శిఖరం.....మనమందరమూ ఎవరెస్ట్ శిఖారాన్ని ప్రపంచములోనే అతిపెద్ద శిఖరం గా చెబుతున్నాము. ఎవరెస్ట్ శిఖరం తన మూలం నుండి 29,028 అడుగుల ఎత్తు కలిగినదైనా, హవాయ్ దీవిలో ఉన్న "మౌనా కియా" అగ్ని పర్వతం ఎత్తు 33,465 అడుగులు. అయితే దీని మూలం సముద్ర గర్భంలో ఎక్కువగా ఉన్నది.
అతిపెద్ద సునామీ.....1737 లో కంచత్కా ద్వీపకల్పాన్ని(పెనిన్సులాని)తాకిన సునామీ. అప్పుడు సముద్రపు అలలు అక్కడ 210 అడుగుల ఎత్తుకు ఎగసి పడ్డాయట.
సముద్రలాలో నుండే మానవులకు 50 శాతం ఆక్సిజన్ దొరుకుతోంది.....సముద్రాలలొ ఫైటోప్లాంక్టన్ అనే సూక్ష్మ జీవులున్నాయి. ఇవేగనుక లేకపోతే సముద్రాలలో సముద్ర ప్రాణులే ఉండవు. దీనికీ మానవ జీవితానికీ ఏమిటి సంభందం అనుకుంటున్నారని తెలుసు. ఉన్నది. సముద్రాలలో సంవత్సరానికి 200 మిల్లియన్ టన్నుల ఫైటోప్లాంక్టన్స్ పెరుగుతాయి. దాని బరువు ఎంత ఉంటుందంటే మొత్త ప్రపంచ జనభా బరువుకు 10 రెట్లు ఎక్కువ ఉంటుందట. ఇవి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఎంత ఆక్సిజన్ అంటే మనం పీల్చుకునే మొత్త ఆక్సిజన్ లో 50 శాతం వీటి నుండే వెలువడుతోందట. అంటే మనం పీల్చుకునే ఆక్సిజన్ లో సగం ఈ సూక్ష్మ క్రిములే ఇస్తున్నాయి.
బ్లూ తిమింగలము....... భూ గ్రహం లో అతిపెద్ద ప్రాణి ఇదే. దీని బరువు సుమారు 150-170 మెట్రిక్ టన్నులు గా ఉంటుంది. అంటే సుమారు 50 ఏనుగుల బరువు. దీని హ్రుదయ పరిమాణం ఒక చిన్న కారు పరిమాణంతో సమానంగా ఉంటుంది. దీని రక్త నాలాలు ఎంత పెద్దవిగా ఉంటాయంటే ఒక జల్లుచేప దాంట్లో ఈదుకుంటూ వెళ్లవచ్చు. ఇది రోజుకు 4 టన్నుల ఆహారం తింటుందట.
పగడాల దిబ్బలు......మనిషి యొక్క ఎముకల రసాయనాలు పగడాల రసాయనం కు దగ్గరగా ఉన్నది. మనుష్యులలో ఎముకలను బాగుచేయడానికీ, ఎముకలను రీ ప్లేస్ చేయడానికీ ఇప్పుడు వీటిని ఉపయోగిస్తున్నారు.
బీచ్ లు.....ప్రపంచ జనాభాలో 50 శాతం మంది సముద్ర తీరానికి 60 మైళ్ల దూరంలొ నివసిస్తున్నారు. అందుకే బీచ్ లు ఎప్పుడూ జన సమూహంతో నిండి ఉంటుంది.
గ్లోబల్ వార్మింగ్.....గ్లోబల్ వార్మింగ్ గురించి మనందరికీ తెలుసు. అయితే అది ఎంత అపాయకరమైనదో తెలియదు. తెలుసుకుందాం. ప్రపంచ వాతావరణ ఉష్ణోగ్రత 7F గానీ లేక 4C గాగాని పెరిగితే పోలార్ ఐస్ గడ్డలను కరిగించేస్తుంది. ఆ కరిగిన నీటితో సముద్ర మట్టం 230 అడుగులు పెరుగుతుంది. దీని వలన కోస్తా ప్రాంతాలలో ఉన్న నగరాలన్నీ మునిగిపోయే ప్రామాదమున్నదట.

1 comment: