Thursday, April 12, 2012

"క్లౌడ్ అప్రీషియేటింగ్ సొసైటీ" వారి మబ్బుల్లో ఆకారాలు....ఫోటోలు

పెద్దగా పట్టించుకోముగానీ మబ్బుల్లో ఎన్నెన్నో ఆకారాలు కనిపిస్తాయట. మబ్బుల్లో ఆకారాలను కనిపెట్టడానికి ఒక సామాజాన్నే ఏర్పరిచేరంటే ఆశ్చర్యంగానూ, ఆసక్తిగానూ ఉన్నది. ఆ సమాజాన్ని "క్లౌడ్ అప్రీషియేటింగ్ సొసైటీ" అని పిలుస్తారు. దీనిని 2005 లో ఇంగ్లాండ్ కు చెందిన గావిన్ ప్రీటర్ -పిన్నే స్థాపించేరు. అంతర్జాలంలో ఈ పేరుతో ఒక వెబ్ పేజీని తెరిచేరు. ఇప్పుడు ఈ వెబ్ సామాజంలో 83 దేశాలకు చెందిన 29,000 మంది మెంబర్లుగా ఉన్నారు. వీరంతా తాము తీసిన మబ్బుల్లో ఆకారాల ఫోటోలను ఈ వెబ్ పేజ్ లో ఉంచేరు. అందులో కొన్నింటిని చూద్దాం. కోతి ఆకారం.....బ్యాంకాక్
అన్య ప్రాణి తల....అమెరికా
అల్లావుద్దీన్ దీపం...చిలి
కోడి పుంజు...కాలిఫోర్నియా....అమెరికా
పావురం....ఇంగ్లాండ్
గ్రద్ద....ఇంగ్లాండ్
ఈక....ఇంగ్లాండ్
మనిషి....అమెరికా
నవ్వుతున్న సూర్యుడు....అమెరికా
"బయటకుపో" చెబుతున్న బాస్....బ్యాంకాక్
మొసలి మీద కూర్చున్న తాబేలు....ఫ్రాన్స్-స్పైన్ సరిహద్దులో

No comments:

Post a Comment